భోపాల్: బీజేపీ నేతను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాటకీయ ఎన్కౌంటర్ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కాల్పుల్లో గాయపడిన హంతకులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. (BJP Leader’s Killers Arrested) మధ్యప్రదేశ్‌లో కాట్ని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ జిల్లా పిచ్డా మోర్చా మండల అధ్యక్షుడు నీలేష్ రజక్ మంగళవారం హత్యకు గురయ్యారు. కైమోర్లోని మార్కెట్ వద్ద బైక్‌పై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపి రజక్‌ను హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. అక్రమ్ ఖాన్, ప్రిన్స్ జోసెఫ్‌లను నిందితులుగా గుర్తించారు. కాట్నిలోని కజ్ర్వారా సమీపంలో హైస్పీడ్ ఛేజింగ్ తర్వాత పోలీసులు వారిని చుట్టుముట్టారు. నిందితులు కాల్పులు జరుపగా ప్రతిగా కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన అక్రమ్ ఖాన్, ప్రిన్స్ జోసెఫ్‌లను చికిత్స కోసం జబల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు లవ్‌జిహాద్ కేసులో జోక్యం చేసుకున్నందుకు నీలేష్ రజక్‌ను నిందితులు హత్య చేసినట్లు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సంజయ్ పాఠక్ ఆరోపించారు. ఒక వ్యక్తి తన వెంటపడి వేధిస్తున్నట్లు స్కూల్ బాలిక నీలేష్‌కు ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై చర్యలకు డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నీలేష్‌ను రోడ్డు మధ్యలో కాల్చి చంపుతానని నిందితుడు హెచ్చరించాడని, నెలన్నర తర్వాత ఆ విధంగా హత్య చేశాడని సంజయ్ పాఠక్ ఆరోపించారు. అయితే బీజేపీ నేత హత్యలో మరో నిందితుడు ప్రిన్స్ జోసెఫ్‌పై కేసు నమోదైనట్లు తెలుసుకున్న అతడి తండ్రి నెల్సన్ జోసెఫ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
BREAKING: BJP & Bajrang Dal leader Neelu Rajak shot dead in broad daylight — by Akram Khan and Prince Joseph in Vijayraghavgarh, MP.
Neelu had opposed Akram and Prince’s eve-teasing of schoolgirls. A month ago, Akram threatened to shoot him before police eyes.
The BJP leader… pic.twitter.com/W0xiI97OSS
— Treeni (@TheTreeni) October 28, 2025
Also Read:
Watch: బైక్ స్టంట్‌లో బీటెక్ విద్యార్థి మృతి.. స్కిడ్ కావడంతో ఎగసిన నిప్పురవ్వలు
Watch: మంటల్లో దగ్ధమైన బస్సు.. డ్రైవర్ అలెర్ట్‌తో ప్రయాణికులు సురక్షితం
Watch: స్కూల్ యూనిఫాంలో అమ్మాయిలు.. లిక్కర్ షాపులో మద్యం కొనుగోలు