లక్నో: ఒక వ్యక్తి శృంగారం కోసం తన భార్యను బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశాడు. (Man Throws Wife Off Roof) తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. మౌ రాణిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల తీజా, ముఖేష్ అహిర్వార్ 2022లో ఒక గుడిలో కలుసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.
కాగా, ఏడాది తర్వాత వారి కాపురంలో కలతలు రేగాయి. ముఖేష్ చాలా రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండేవాడు. తిరిగి వచ్చిన తర్వాత భార్యను కొట్టి హింసించేవాడు. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్న అతడు సోమవారం తిరిగి వచ్చాడు. మంగళవారం భార్య తీజాను కొట్టడంతోపాటు శృంగారంలో పాల్గోవాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో రెండస్తుల బిల్డింగ్ మేడ పైనుంచి కిందకు తోసేశాడు.
మరోవైపు బిల్డింగ్ పైనుంచి కిందపడిన తీజా తీవ్రంగా గాయపడింది. ఆమె అరుపులు విన్న స్థానికులు తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. శృంగారానికి నిరాకరించినందుకు భర్త ముఖేష్ అహిర్వార్ అతడి తల్లిదండ్రులతో కలిసి బిల్డింగ్ పైనుంచి తనను తోసినట్లు తీజా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
DK Shivakumar | కారు లేని అబ్బాయిలతో అమ్మాయిలకు పెళ్లి చేయరు: డీకే శివకుమార్
Watch: ఆసక్తి రేపుతున్న డ్రైవర్లెస్ కారు.. వీడియో వైరల్