లక్నో: బీజేపీ మాజీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పది మంది ముస్లిం అమ్మాయిలను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని హిందూ అబ్బాయిలకు సూచించారు. వారికి అండగా ఉండటంతో పాటు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. (Raghvendra Pratap Singh) ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లా దుమారియాగంజ్కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ అక్టోబర్ 16న ధంఖర్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. ఇద్దరు హిందూ మహిళలను ముస్లిం పురుషులతో బలవంతంగా వివాహం చేసి మతం మార్చడంపై ఆయన మండిపడ్డారు. ఇద్దరు హిందూ మహిళలకు బదులుగా పది మంది ముస్లిం అమ్మాయిలను హిందూ యువకులు లేపుకొని వెళ్లి పెళ్లి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘ముస్లిం అమ్మాయితో పారిపోయిన ఏ హిందువుకైనా నేను వివాహం ఏర్పాటు చేస్తా. వారికి ఉపాధి కూడా కల్పిస్తా’ అని అన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని, హిందువులు భయపడాల్సిన అవసరం లేదని రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ‘ఇది అఖిలేష్ యాదవ్ కాలం కాదు. భయపడాల్సిన అవసరం లేదు. మేం మీతో ఉన్నాం. ముస్లిం అబ్బాయిలు ఇద్దరు హిందూ అమ్మాయిలను వివాహం చేసుకుంటే సమస్య అంతటితో ముగియదు. ఇద్దరికి బదులుగా, హిందూ యువకులు కనీసం పది మంది ముస్లిం అమ్మాయిలను తీసుకువచ్చి వివాహం చేసుకోవాలి. మిగిలినది నేను చూసుకుంటా’ అని అన్నారు.
మరోవైపు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఖండించింది. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పదే పదే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. మతపరమైన అశాంతిని సృష్టించే వ్యూహంలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని దుమారియాంగంజ్ ఎస్పీ ఎమ్మెల్యే సయ్యదా ఖాటూన్ విమర్శించారు. మహిళలతోపాటు ముస్లింలను నిరంతరం అవమానిస్తున్నారని అన్నారు. తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అధికారులు మూగ ప్రేక్షకుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు.
Siddharthnagar, Uttar Pradesh, Former BJP MLA Raghvendra Pratap Singh openly urged Hindu men to “marry more Muslim girls” during a public gathering.
This is the same state that jails Muslims under “forced conversion” laws. But when a Hindutva leader promotes interfaith marriage… pic.twitter.com/W3iayoVxDc
— Muslim IT Cell (@Muslim_ITCell) October 26, 2025
Also Read:
DK Shivakumar | కారు లేని అబ్బాయిలతో అమ్మాయిలకు పెళ్లి చేయరు: డీకే శివకుమార్
Watch: ఆసక్తి రేపుతున్న డ్రైవర్‌లెస్ కారు.. వీడియో వైరల్
Watch: బాలిక పైనుంచి కారు నడిపిన మైనర్ బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?