చండీగఢ్: రుతుక్రమంలో ఉన్న పారిశుద్ధ్య మహిళలు సెలవు కోరారు. అయితే ఆధారం కోసం వినియోగించిన శానిటరీ ప్యాడ్ ఫొటోలు పంపాలని సూపర్వైజర్లు బలవంతం చేశారు. (staff force women to show period proof) ఈ నేపథ్యంలో మహిళా పారిశుద్ధ్య సిబ్బంది నిరసన తెలిపారు. హర్యానాలోని రోహ్తక్లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 26న మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయాన్ని హర్యానా గవర్నర్ అషిమ్ కుమార్ ఘోష్ సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఆదివారం సెలవు అయినప్పటికీ మహిళలతో సహా పారిశుద్ధ్య కార్మికులందరిని విధులకు పిలిచారు.
కాగా, ముగ్గురు మహిళా పారిశుద్ధ్య సిబ్బంది తాము పీరియడ్స్‌లో ఉన్నామని, సెలవు కావాలని కోరారు. అయితే ఆధారం కోసం వినియోగించిన శానిటరీ ప్యాడ్ ఫొటోలు పంపాలని సూపర్వైజర్లు బలవంతం చేశారు. రుతుక్రమాన్ని తనిఖీ చేయాలని ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. ఆ మహిళలకు సెలవు ఇచ్చేందుకు నిరాకరించారు. డ్యూటీకి వచ్చిన ఒక మహిళ రుతుక్రమాన్ని మరో మహిళా సిబ్బందితో తనిఖీ చేయించారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో మహిళా కార్మికులు నిరసన చేపట్టారు. ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు కూడా నిరసనలో పాల్గొని మద్దతు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో తగిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు.
మంగళవారం షెడ్యూల్డ్ కులాల కమిషన్ ప్రతినిధులు ఆ యూనివర్సిటీని సందర్శించారు. బాధిత మహిళల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. క్రమశిక్షణా చర్యలు సిఫార్సు చేశారు. దీంతో విశ్వవిద్యాలయ పరిపాలన యంత్రాంగం స్పందించింది. ఇద్దరు సూపర్వైజర్లను సస్పెండ్ చేసింది. దర్యాప్తు చేయాలని విశ్వవిద్యాలయ అంతర్గత కమిటీకి సూచించింది. బాధిత మహిళల ఫిర్యాదుతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Farmer Attempts Suicide | ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారన్న భయంతో.. బెంగాల్ రైతు ఆత్మహత్యాయత్నం