Zelensky: పుతిన్ మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టారు: జెలెన్స్కీ
Zelensky : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడో మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టారని, ఆయన్ను అడ్డుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నాలుగేళ్లకు చేరుకున్నది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడో మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) అన్నారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రష్యాపై కాలుదువ్వడాన్ని సమర్ధించుకున్న జెలెన్స్కీ.. తామేమీ యుద్ధం నుంచి విరమించడం లేదన్నారు. ఈ యుద్ధంలో తాము విజేతలుగా నిలుస్తామని జెలెన్స్కీ అన్నారు. కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ చేసిన డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. వేల మంది సైనికులు మృతిచెందిన తర్వాత తమ వ్యూహాత్మక స్థానాలను రష్యా వదులుకున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. పుతిన్ ఎప్పుడో మూడవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించారని, దీన్ని అడ్డుకోవాలంటే రష్యాపై తీవ్రమైన సైనిక, ఆర్థిక వత్తిడి తీసుకురావాల్సి ఉంటుందన్నారు. పుతిన్ ఎప్పుడో మూడవ ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టినట్లు నమ్ముతున్నానని, ఆయన ఎంత భూభాగాన్ని ఆక్రమిస్తారు, ఆయన్ను ఎలా అడ్డుకోవాలన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారిందని, ప్రపంచంపై రష్యా తన పెత్తాన్ని ప్రదర్శిస్తున్నట్లు జెలెన్స్కీ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

