రాజాపేట, ఫిబ్రవరి 23 : రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్ మాట్లాడుతూ.. యాప్‌లో యూరియా బుక్ చేసుకుందామనుకుని ఓపెన్ చేసే క్రమంలో సెకండ్లలో యూరియా ఖాళీ అయిపోతుందన్నారు. దీంతో రైతులకు యూరియా లభించడం లేదన్నారు. చదువు రాక స్మార్ట్ ఫోన్ లేక రైతులు యాప్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియాను పాత పద్ధతిలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటి మధుసూదన్ రెడ్డి, చింతలపూరి వెంకటరామిరెడ్డి, బెడిదే వీరేశం, పల్లె సంతోష్ గౌడ్, అంకతి సుదర్శన్, బోగా హరినాథ్, మరల నాగరాజు, లక్ష్మణ్ నాయక్, కనకయ్య, కర్ల భాను రెడ్డి, కరుణాకర్, కటకం వెంకటేశం, వరిమడ్ల బాలకృష్ణ, తుంగ అక్షయ్, సురేష్ పాల్గొన్నారు.