Balka Suman | బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులకు రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై వాదనలను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
మంచిర్యాల : కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులకు రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) బెయిల్ పిటిషన్ ( Bail Petition) పై వాదనలను కోర్టు రేపటికి వాయిదా వేసింది. మంచిర్యాల జిల్లా జైలులో ఉన్న బాల్కసుమన్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సోమవారం విచారణకు రాగా కోర్టు పరిశీలించింది.కౌంటర్ పిటిషన్ పై గడువు కావాలని పోలీసులు కోరగా బెయిలు పిటిషన్ పై వాదనలను రేపటికి వాయిదా వేసింది. జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో విజయం సాధించగా చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది.
పోలీసులను, ప్రభుత్వాన్ని నిలదీసిన బాల్కసుమన్‌పై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది . గత వారం రోజులకు పైగా సుమన్ మంచిర్యాల జిల్లా జైలులో ఉన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు బంద్ నిర్వహించాయి .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

