Rajasthan | పరీక్షకు వెళ్తుండగా మిస్సైన బాలిక అనుమానాస్పద మృతి.. హత్యాచారం చేశారంటూ ఆందోళన
Rajasthan : రాజస్థాన్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పదంగా మరణించింది. దీంతో బాలికపై హత్యాచారం జరిగిందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు.
Rajasthan : రాజస్థాన్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పదంగా మరణించింది. దీంతో బాలికపై హత్యాచారం జరిగిందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు, బాధిత బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్, బికనీర్ పరిధి, రంజీత్పూర్కు చెందిన పదమూడేళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. స్కూల్లో పరీక్షకు వెళ్తున్నానని చెప్పి శనివారం ఉదయం 11.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరిగి రాలేదు.
బాలిక స్కూల్‌కు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆమె కుటుంబానికి మధ్యాహ్నం సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు బాలిక కోసం గాలించగా.. స్కూల్‌కు అర కిలోమీటర్ దూరంలో, అడవిలో బాలిక మృతదేహం కనిపించింది. అది కూడా అర్ధనగ్నంగా. ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో బాలికపై అత్యాచారం చేసి చంపేశారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానిక హైవేను దిగ్బంధించారు. బాలికపై హత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు, అధికారులు స్పందించారు. బాలిక బంధువులతో చర్చలు జరుపుతున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనేది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. ఈ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పరిహారం, ఆందోళన విరమించచే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాల్ని మోహరించారు. మరోవైపు స్థానిక ఎంపీ అర్జున్ రామ్ మేఘవాలే స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తానని తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

