 
                                                            భోపాల్: క్రేన్ ఎక్కిన బీజేపీ ఎంపీ ఒక విగ్రహానికి దండ వేశారు. కిందకు దిగుతుండగా ఆ క్రేన్ జర్క్ ఇచ్చింది. దీంతో ఆ బీజేపీ ఎంపీ ఆగ్రహం చెందారు. క్రేన్ ఆపరేటర్ చెంపపై కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (BJP MP Slaps Crane Operator ) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సత్నాలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం నిర్వహించారు.
కాగా, ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ క్రేన్ ఎక్కారు. సెమ్రియా చౌక్ వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేశారు. ఆ తర్వాత క్రేన్ కిందకు దిగుతుండగా సాంకేతిక సమస్య వల్ల జర్క్ ఇచ్చింది. దీంతో క్రేన్ బాక్సులో ఉన్న ఎంపీ గణేష్ సింగ్ ఆగ్రహించారు. మున్సిపల్ క్రేన్ ఆపరేటర్‌ను దగ్గరకు పిలిచి అతడి చెంపపై కొట్టారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆ ఎంపీ తీరుపై మండిపడింది. బీజేపీ నేతలు అధికార బలంతో విర్రవీగుతున్నారని విమర్శించింది.
सांसद जी हैं भाई, क्रेन में फंस कैसे गए!
सतना के अहंकारी और अपने कारनामों के लिए चर्चित सांसद गणेश सिंह ने निगम कर्मचारी क्रेन ऑपरेटर को चांटा मार दिया!
उस निरीह का दोष इतना था कि क्रेन में फंसे सांसद को बचाने चला गया! भाजपाई जनप्रतिनिधियों में अहंकार और सामंती मानसिकता उनके सर… pic.twitter.com/G1RE8AJ3o0
— MP Congress (@INCMP) October 31, 2025
Also Read:
Ayurvedic syrup | ఆయుర్వేద సిరప్ తాగి.. ఆరు నెలల చిన్నారి మృతి
Woman Killed By Daughter’s Friends | ఇంట్లోకి రావద్దన్నందుకు.. మహిళను హత్య చేసిన కూతురి స్నేహితులు
Woman Kills Son With Lover | బీమా డబ్బు కోసం.. ప్రియుడితో కలిసి కుమారుడ్ని హత్య చేసిన మహిళ
 
                            