న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: బంగారం, వెండి ధరలు మళ్లీ రెండు శాతం వరకు అధికమయ్యాయి. కిలో వెండి రూ. 2.77 లక్షలకు చేరుకోగా, గోల్డ్ ధర రూ.1.64 లక్షలకు చేరుకున్నది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పుంజుకుంటున్నాయి.
న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్చత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ. 1,000 ఎగబాకి రూ.1,64,200కి చేరుకున్నది. కిలో వెండి రూ.5,900 లేదా 2 శాతం ఎగబాకి రూ.2,77, 900 పలికింది. అంతక్రితం ఇది రూ.2.72 లక్షలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒక్క శాతం ఎగబాకి 5,181.46 డాలర్లకు చేరుకోగా, వెండి 3.13 డాలర్లు లేదా 3.59 శాతం ఎగబాకి 90.30 డాలర్లుగా నమోదైంది.