ఢిల్లీ: భారత యువ ప్యాడ్లర్ ద్వయం మానవ్ ఠక్కర్, మానుష్ షా సరికొత్త చరిత్ర సృష్టించింది. సింగపూర్‌లో జరుగుతున్న డబ్ల్యూటీటీ సింగపూర్ స్మాష్ టోర్నీలో ఈ జోడీ సెమీస్ చేరింది. బుధవారం జరిగిన క్వార్టర్స్ పోరులో ప్రపంచ ఐదో ర్యాంకు జోడీ అయిన మానవ్, మానుష్.. 3-0 (11-8, 11-9, 11-9)తో మార్టిన్ అలెగ్రొ-అడ్రియన్ రసెన్ఫొస్ (బెల్జియం)ను చిత్తుచేశారు.
వీరి జోరుకు 27 నిమిషాల్లోనే ప్రత్యర్థి మట్టికరిచారు. తద్వారా డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ చరిత్రలో భారత్ నుంచి సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో సెమీస్ చేరిన తొలి ప్యాడ్లర్లుగా మానవ్, మానుష్ రికార్డు సృష్టించారు. కాగా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మానుష్, దివ్య చిటాలె జంట పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది.