అయిజ, ఆగస్టు 3 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగ (గాజనూరు) డ్యాం పూర్తిగా నిండటంతో గేట్లెత్తి 87,841 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో టీబీ డ్యాంకు వరద పోటెత్తనున్నది. సోమవారం టీబీ డ్యాంకు ఇన్ఫ్లో 57,785 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,390 క్యూసెక్కులు నమోదైంది.
కర్ణాటక, ఏపీ తాగునీటి అవసరాల కోసం కాల్వల ద్వా రా 1,390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం గరిష్ఠ నీటిమట్టం1633 అడుగులకు గా నూ ప్రస్తుతం 1613.16 అడుగుల నీటిమట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 44.190 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు. డ్యాంలోకి వరద చేరుతుండటంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతుందని చెప్పారు. మంగళవారం తుంగభద్ర డ్యాంకు వరద భారీగా చేరుతుందని పేర్కొన్నారు.