గద్వాల, ఆగస్టు 3 : సర్ ప్రక్రియకు గడువు సమీపిస్తు న్న సమయంలో ఓటర్లలో అయోమయం నెలకొన్న ది. తమ ఓటు ఉంటుందో ఊడుతుందో ఆనే ఆందోళనలో ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియ మొదటి ను ంచి ఓటర్లకు సంకటంగానే మారింది. వాటిని ని వృత్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చె ప్పవచ్చు. దరఖాస్తులు నింపే ప్రక్రియలో చదువుకున్నా వారికే పలు అనుమానాలు తలెత్తా యి. చదువుకోని వారి పరిస్థితి గందర గోళం గా ఉండడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.
దరఖాస్తుల ప్రక్రియ పూ ర్తి చేసే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నా వాటిని డిజిటలైజేషన్ చేయడం బీఎల్వోలకు సంకటంగా మారింది.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, అనర్హులను తొలగించాలనే లక్ష్యం తో కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్ర క్రియను చేపట్టింది. ప్రక్రియ ము గింపు గడువుకు ఇంకా వారంరోజులే సమయం ఉండడంతో డి జిటలైజేషన్ ప్రక్రియ వేగ వంతం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. స ర్ దరఖాస్తు ఫారాలు బీఎల్వోలకు ఇవ్వని ఓటర్లు వెంటనే ఇచ్చి డిజిటలైజేషన్ చేయించుకోవాల ని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వం సర్ గ డువును మరోసా రి పెంచింది. మొదట ఆగస్టు 3వతేదీ వరకే ఉండగా దా నిని ఆగస్టు 10వ తేదీ వరకు పెంచిం ది.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర సవరణ ప్రక్రియ జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.08శాతం పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా నడుస్తున్న అర్బన్ ప్రాంతాల్లో మాత్రం నెమ్మదిగా కొనసాగుతున్నది. గడువు 7రోజులే ఉండడంతో డిజిటలైజేషన్ 100శాతం పూర్తి అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం 100 శాతం డిజిటలైజేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా(గద్వాల, అలంపూర్) లో 5,03,859 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 4,37,306 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసి డిజిటలైజేషన్ పూర్తి చేశారు. జిల్లాలో 86.08 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. గద్వాల నియోజకవర్గంలో 2,61,810మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 2,19,945మంది ఓటర్ల వివరాలు మాత్రమే మ్యాపింగ్‌తో పాటు డిజిటలైజేషన్ చేశారు.
ఇంకా 39,698 మంది దరఖాస్తులు తిరిగి ఇవ్వక పోవడంతో ఓటర్ల వివరాలు మ్యాపింగ్ జరగలేదు. మిగిలిన ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటి వరకు బీఎల్వోలకు అందలేదు. ఈ ఫారాలు పూర్తి చేసి ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసే అవకాశం ఉంది. అలంపూర్ నియోజకవర్గంలో 2,42,049 మ ంది ఓటర్లు ఉండగా 2,17,361మంది ఓటర్ల వివరా లు మ్యాపింగ్‌తో పాటు డిజిటలైజేషన్ అధికారులు పూ ర్తి చేశారు. ఇంకా 22,364మంది ఓటర్లు తమ దరఖాస్తులను ఇవ్వకపోవడంతో వివరాలు మ్యాపింగ్ జరగలేదు. జిల్లాలో 62,062దరఖాస్తులు ఓటర్ల నుంచి బీఎల్వోలకు రావాల్సి ఉంది. దీంతో ఓటర్ల వివరాలు మ్యా పింగ్ జరలేదు. వారంరోజులే గడువు మిగిలి ఉండడం తో ఓటర్లు తమ దరఖాస్తులను బీఎల్వోలకు ఇస్తే తమ ఓటు ఉంటుంది లేకపోతే ఓటు కోల్పోవాల్సి వస్తుంది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మండలాల వారీగా డిజిటలైజేషన్ అయిన వివరాలు చూస్తే ధరూర్ 85.59, గద్వాలరూరల్ 88.61, గద్వాల అర్బన్ 70.07, గట్టు 89.62, కేటీదొడ్డి 88.61, మల్దకల్ 90.28శాతం ఉంది. అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్ మండలంలో 89.76, అయిజలో 91.95, ఇటిక్యాలలో 90.52, మానవపాడులో 90.37, రాజోళిలో 87.95, ఉండవెల్లిలో 90.72, వడ్డేపల్లి 86.79, ఎర్రవల్లి మండలంలో 87.33శాతం డిజిటలైజేషన్ పూర్తి అయినట్లు అధికారుల ద్వారా తెలిసింది. గద్వాల అర్బన్‌లో మాత్రం 70శాతం డిజిటలైజేషన్లో వెనుకబడిపోయింది. డిజిటలైజేషన్లో అయిజ మండలం ముందుంది. పైనున్న వివరాలన్నీ జూలై 31 వరకు అధికారులు వెల్లడించారు.