Suryakumar Yadav : భారత టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను స్క్వాడ్ నుంచి తప్పించింది ముంబై క్రికెట్ సంఘం. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు ఎంపిక చేసిన బృందంలో ఈ మిస్టర్ 360కి చోటు దక్కలే. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన ఆయుశ్ మాత్రేకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు సెలెక్టర్లు. ముంబై స్క్వాడ్‌కు సిద్దేశ్ లాడ్ కెప్టెన్ సారథ్యం వహించనుండగా టీమిండియా స్టార్ యశస్వీ జైస్వాల్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు.
రంజీ ట్రోఫీ కోసం సోమవారం ముంబై సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. ఆశ్చర్యంగా సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం చోటు లభించలేదు. టీ20 కెప్టెన్సీ పోగొట్టుకున్న అతడు రంజీలో తొలి మ్యాచ్‌కు ఎంపిక చేసిన బృందంలో లేకపోవడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. దాంతో.. తదుపరి మ్యాచులకు సూర్యను తీసుకుంటారా? పక్కనపెట్టేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. సూర్యనే తనను పరిగణించవద్దని సెలెక్టర్లు చెప్పాడని వినికిడి.
Suryakumar Yadav has been left out of Mumbai’s 16-member squad for their Ranji Trophy opener against Chandigarh, despite making himself available for the game. https://t.co/oD3jM1VFq0
— Cricbuzz (@cricbuzz) October 5, 2026
ఇదే విషయంపై ముంబై సెలెక్షన్ కమిటీ చీఫ్ రాజేశ్ పవార్ మాట్లాడుతూ.. సూర్య బిగ్ మ్యాచ్ ప్లేయర్. గతంలో తాను నిరూపించుకున్నాడు కూడా. అయితే.. అతడు రెడ్ బాల్ క్రికెట్లో లయ అందుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే.. గత 18 నెలల్లో సూర్య ఒక్క టెస్టు కూడా ఆడలే అని పేర్కొన్నాడు.
టాపార్డర్‌లో సారథి సిద్దేశ్ లాడ్, యశస్వీ.. వైస్ కెప్టెన్ ఆయుశ్ మాత్రేలు ఉండగా.. ఖాన్ బ్రదర్స్ మిడిలార్డర్లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ దళంలో డిసౌజా, తరమలే, ములనీ, దేశ్‌పాండే, అవస్థిలు ఎంపికయ్యారు. రికార్డు స్థాయిలో 42సార్లు రంజీ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఈసారి తొలిపోరులో ఛండీగఢ్ను ఢీకొట్టనుంది. వాంఖడే స్టేడియంలో అక్టోబర్ 11న ఈమ్యాచ్ జరుగనుంది.
ముంబై స్క్వాడ్ : సిద్దేశ్ లాడ్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, ఆయుశ్ మాత్రే(వైస్ కెప్టెన్), దివ్యాన్ష్ సక్సేనా, ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, సువెద్ పార్కర్, ఆకాశ్ ఆనంద్(వికెట్ కీపర్), హార్దిక్ తోమ్రే(వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కొతియన్, అథర్వ అంకొలేల్కర్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, ఓంకార్ తరమలే.