పాట్నా: తన కుటుంబం కోసం ఎప్పుడూ తాను పని చేయలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) అన్నారు. తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి నిజాయితీతో కష్టపడి పనిచేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేసినట్లు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక వీడియో సందేశాన్ని శనివారం రిలీజ్ చేశారు. 2005లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ‘బీహారీ’గా ఉండటం అవమానకరమైన విషయమని జేడీయూ చీఫ్ అయిన నితీశ్ కుమార్ తెలిపారు. ‘నా ప్రియమైన బీహార్ సోదర సోదరీమణులారా, 2005 నుంచి మీకు సేవ చేసే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. ఆ సమయంలో బీహార్‌ను మనం పొందిన పరిస్థితి అవమానకరమైన విషయం అని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అప్పటి నుంచి నిజాయితీతో కష్టపడి మీకు పగలు, రాత్రి సేవ చేశాం’ అని అన్నారు. విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్, తాగునీరు, వ్యవసాయంతోపాటు యువతకు అవకాశాలను మెరుగుపరిచినట్లు చెప్పారు.
కాగా, మహిళలను చాలా బలంగా మార్చామని, వారు ఇకపై ఎవరిపైనా ఆధారపడరని నితీశ్ కుమార్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ‘మీరు హిందువు అయినా, ముస్లిం అయినా, అగ్రవర్ణుడైనా, వెనుకబడిన వారైనా, దళితుడైనా, మహా దళితుడైనా మేము అందరి కోసం పనిచేశాం. నా కుటుంబానికి నేను ఏమీ చేయలేదు’ అని అన్నారు.
మరోవైపు ఇప్పుడు బీహారీగా ఉండటం అవమానకరమైన విషయం కాదని, గౌరవానికి సంబంధించిన విషయమని రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు సీఎం పదవి చేపట్టిన నితీశ్ కుమార్ తెలిపారు. ‘మాకు మరో అవకాశం ఇవ్వండి. దీని తర్వాత మరిన్ని పనులు జరుగుతాయి. ఇది బీహార్‌ను ఎంతగానో అభివృద్ధి చేస్తుంది. అగ్ర రాష్ట్రాలలో చేర్చుతుంది’ అని రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
కాగా, 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
प्रिय प्रदेशवासियो,
आइए मिलकर बनाएं नया बिहार।@NitishKumar #Bihar #NitishKumar #JDU #JanataDalUnited #25Se30FirSeNitish pic.twitter.com/XxTqqVaWTp
— Janata Dal (United) (@Jduonline) November 1, 2025
Also Read:
BJP MP Praveen Khandelwal | ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చండి.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ
Watch: ఛత్ ప్రసాదం కోసం.. ప్యాసింజర్ రైలు ఆపిన లోకో పైలట్, వీడియో వైరల్