తెలంగాణ సినీ ప్రస్థానం
డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తక పరిచయ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్, దర్శకులు వేణు ఊడుగుల, అల్లాణి శ్రీధర్, సినీ జర్నలిస్ట్ ప్రభు, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తక పరిచయ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్, దర్శకులు వేణు ఊడుగుల, అల్లాణి శ్రీధర్, సినీ జర్నలిస్ట్ ప్రభు, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత, సినీ విమర్శకులు మామిడి హరికృష్ణకు అంకితమిచ్చారు. పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ ‘గతంలో నేను రాసిన 80 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానం పుస్తకానికి ఉమ్మడి రాష్ట్రంలో నంది పురస్కారం దక్కింది.
ఇప్పుడు ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తకాన్ని తీసుకురావడం ఆనందంగా ఉంది. పైడి జయరాజ్‌కు ముందు నుంచే చాలా మంది తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులు సినీరంగంలో సత్తా చాటారు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో చాలా మంది తెలంగాణ వారు ఉండటం విశేషం’ అన్నారు. ఈ పుస్తక రచనతో పొన్నం రవిచంద్ర గొప్ప ప్రయత్నం చేశారని కేవీ విజయేంద్రప్రసాద్ కొనియాడారు. తెలంగాణ సినిమా గురించి ఎంతో సమాచారాన్ని ఈ పుస్తకం ద్వారా తెలియజేశారని మామిడి హరికృష్ణ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

