Parul Chaudhary | అమ్మో చలి.. కాలివేళ్లు బిగుసుకుపోవడంతో పతకం చేజారింది..!
Parul Chaudhary : కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ రన్నర్ పరుల్ చౌదరీ (Parul Chaudhary) తీవ్రంగా నిరాశపరిచింది. ప్రతికూల పరిస్థితుల కారణంగానే తాను వెనకబడ్డానని పరుల్ వాపోయింది.
Parul Chaudhary : కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ రన్నర్ పరుల్ చౌదరీ(Parul Chaudhary) తీవ్రంగా నిరాశపరిచింది. మహిళల 3000 స్టీపుల్ ఛేజ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పరుల్ అనూహ్యంగా ఐదో స్థానంతో పతకానికి దూరమైంది. అయితే.. గ్లాస్గోలోని ప్రతికూల పరిస్థితుల కారణంగానే తాను వెనకబడ్డానని, ఇక ఆసియా క్రీడల్లో పోడియం లక్ష్యంగా సిద్ధమవుతానని చెప్పిందీ అథ్లెట్.
భారత అథ్లెట్లలో కచ్చితంగా పతకం గెలుస్తుందనుకున్న పరుల్ చౌదరీకి చుక్కెదురైంది. మహిళల 3000 స్టీపుల్ ఛేజ్‌లో ఆమె 5వ స్థానంతో నిరాశపరిచింది. గురువారం జరిగిన పోటీల్లో పరుల్. 9:26.75 టైమింగ్‌తో రేసును పూర్తి చేసింది. ఫలితంగా తొలిసారి కామన్వెల్త్లో పతకం సాధించాలనుకున్న ఆమె కల చెదిరింది. సన్నద్ధత పరంగా అంతా బాగున్నప్పటికీ పత్రికూలా వాతావరణం తనను దెబ్బతీసిందని భారత రన్నర్ వాపోయింది.
VIDEO | “The weather was cold. When I was running, my fingers were frozen in my spikes, so I couldn’t run,” says Parul Chaudhary after finishing fifth in the women’s 3000m steeplechase final at the Commonwealth Games.
“I wanted to run my best time, but there were no conditions.… pic.twitter.com/onfhnzTepl
— Press Trust of India (@PTI_News) July 30, 2026
‘కామన్వెల్త్లో పతకమే లక్ష్యంగా సాధన చేశాను. కానీ, ఫైనల్ పోటీలో మాత్రం నేను వెనుకబడ్డాను. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది. షూ కూడా నా పాదాలకు రక్షణ ఇవ్వలేకపోయాయి. 3000 స్టీపుల్ చేజ్లో నేను పరుగెత్తే సమయంలో కాలివేళ్లు చలికి బిగుసుకుపోయాయి. దాంతో, నేను పరుగెత్తలేకపోయాను. నేను అత్యుతమ ప్రదర్శన చేయాలనుకున్నా. కానీ, చల్లని గాలులతో కూడిన వాతావరణం కారణంగా నా వల్ల కాలేదు. త్వరలో జరుగునున్న ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా పరుగు తీస్తా’ అని పీటీఐతో పరుల్ వెల్లడించింది.
🚨 “I came here to better my PB, but it didn’t happen,” said Parul after finishing 5th in the women’s 3000m SC final at the CWG 2026.
The Indian distance runner clocked 9:26.75 in a highly competitive final and admitted that she had hoped to improve on her personal best.
It was… pic.twitter.com/nyYXjPOoal
— nnis Sports (@nnis_sports) July 29, 2026
హంగ్జూ వేదికగా 2023లో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు విభాగాల్లో మెడల్స్ గెలిచింది పరుల్. ఈసారి జపాన్ ఆతిథ్యమిస్తున్న టోర్నీలోనూ సత్తా చాటాలనే కసితో ఉందీ అథ్లెట్. పరుల్ మాత్రమే కాదు జావెలిన్ త్రోయర్ నీరచ్ చోప్రా (Neeraj Chopra)సైతం గ్లాస్గోలో చలి తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

