Mallikarjun Kharge | అధికార బీజేపీకి విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయాలే ఎక్కువ : మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge | ప్రభుత్వ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ (Exam Papers Leakage) లను అరికట్టేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర వాగ్వాదం జరిగింది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత (Opposition Leader) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
Mallikarjun Kharge : ప్రభుత్వ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ (Exam Papers Leakage) లను అరికట్టేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర వాగ్వాదం జరిగింది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత (Opposition Leader) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు.
ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి జరిగిందని ఖర్గే ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనే పనిచేస్తాయని గుర్తుచేశారు. ఆ శాఖ అనుమతి లేకుండా ఇలాంటివి జరిగే అవకాశం లేదని అన్నారు. ఈ ఘటనపై అమిత్ షా తన బాధ్యత నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టే బిల్లును ఇంత ఆలస్యంగా ఎందుకు తీసుకొచ్చారని ఖర్గే ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే సంస్కరణలు చేయకుండా ప్రభుత్వం రాజకీయాల్లోనే నిమగ్నమైందని విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలను చల్లార్చేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. బీజేపీ రాజకీయాల వల్లే దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరసనలు, పోలీసు చర్యలు చోటుచేసుకున్నాయని అన్నారు. పేపర్ లీకేజీలు జరిగిన తర్వాత నష్టనివారణ చర్యలు తీసుకోవడం ఒక్కటే సరిపోదని ఖర్గే అభిప్రాయపడ్డారు.
ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరించబోయే స్పష్టమైన కార్యాచరణను వివరించలేదని విమర్శించారు. ఈ బిల్లు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందా అన్న సందేహాన్ని వ్యక్తంచేశారు. గత రెండు నెలలుగా విద్యార్థులు, యువత దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థపై నిరసనలు వ్యక్తంచేశారని ఖర్గే గుర్తుచేశారు. వారి గొంతుకను ప్రతిపక్షం వీధుల నుంచి పార్లమెంట్ వరకు వినిపించిందన్నారు. ప్రజల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గిందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల పోరాటం ఫలించిందని, వారి ఉద్యమంవల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

