న్యూఢిల్లీ: ఒక మహిళ కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్య చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. (woman kills lover with fiance) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మిథాపూర్ ప్రాంతంలో 29 ఏళ్ల లక్ష్మి నివసిస్తున్నది. ఈస్ట్ వినోద్ నగర్‌కు చెందిన ఇన్సురెన్స్ ఏజెంట్చందర్తో ఆమెకు ఐదేళ్లుగా పరిచయం ఉన్నది. వారిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది.
కాగా, 26 ఏళ్ల కేశవ్‌తో కూడా లక్ష్మీకి లవ్ ట్రయాంగిల్ ఉన్నది. ఇటీవల వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఇది తెలుసుకున్న చందర్, లక్ష్మిని బ్లాక్మెయిల్ చేశాడు. కేశవ్‌తో పెళ్లిని రద్దు చేసుకోకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు.
మరోవైపు ప్రియుడు చందర్‌ను హత్య చేసేందుకు కాబోయే భర్తతో కలిసి లక్ష్మి కుట్రపన్నింది. అక్టోబర్ 25న చందర్‌ను మిథాపూర్‌కు రప్పించింది. ఫరీదాబాద్‌లోని ఆత్మద్ పూర్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి బైక్‌పై తీసుకెళ్లింది. అక్కడ వేచి ఉన్న కేశవ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి తాడుతో చందర్ గొంతునొక్కాడు. అతడి తలపై కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేశారు.
కాగా, చందర్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అతడి హత్యపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ద్వారా నిందితులను గుర్తించారు. లక్ష్మీ, ఆమె కాబోయే భర్త కేశవ్‌ను అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించిన పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
BJP MP Praveen Khandelwal | ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చండి.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ
woman gang-raped | మహిళపై మత్తు మందు చల్లి.. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
Watch: స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు.. అతడ్ని ఎలా తీసుకెళ్లారంటే?