ముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు ఓటర్ల జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు అధికార బీజేపీకి సహాయం చేస్తున్నాయని ఆరోపించాయి. ‘సత్యం కోసం పాదయాత్ర’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. (Maharashtra Opposition Holds March) కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)తో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి శనివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. సత్యం కోసం పాదయాత్ర (సత్యాచ మోర్చా) పేరుతో దక్షిణ ముంబైలోని ఫ్యాషన్ స్ట్రీట్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న బీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు నేతలంతా నడిచారు.

Maharashtra Opposition March
కాగా, మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, కాంగ్రెస్ నాయకులు బాలాసాహెబ్ థోరట్ తదితర నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వత జరిగిన భారీ బహిరంగ సభలో వారు ప్రసంగించారు. ఓటరు జాబితాలో ఇతర రాష్ట్రాల వారిని చేరుస్తున్నారని, మార్పులు చేర్పుల పేరుతో అసలు ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు ఓటర్ల జాబితా అవకతవకలతో అధికార బీజేపీ లబ్ధిపొందుతున్నదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకున్నదని ఆరోపించారు. ఓటరు జాబితాలో లోపాలను సరిదిద్దిన తర్వాతే మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Also Read:
Nitish Kumar | ‘నేను నా కుటుంబం కోసం పని చేయలేదు’.. ఎన్నికలకు ముందు నితీశ్ వీడియో సందేశం
BJP MP Praveen Khandelwal | ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చండి.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ
Watch: స్కూల్కు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు.. అతడ్ని ఎలా తీసుకెళ్లారంటే?