న్యూఢిల్లీ: ఒక మహిళ తన బిడ్డతో కలిసి రైలులో ప్రయాణించింది. అయితే ఆమె పర్సు చోరీ అయ్యింది. దీంతో ఆ మహిళ ఆగ్రహించింది. తన బిడ్డ పక్కన ఉండగా ఏసీ కోచ్ విండోను పగులగొట్టింది. అద్దం ముక్కలు అక్కడ చెల్లాచెదురుగా పడ్డాయి. (woman breaks AC coach window) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక మహిళ తన పసిబిడ్డతో కలిసి రైలులో ప్రయాణించింది. ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్న ఆమె పర్సును ఎవరో చోరీ చేశారు.
కాగా, పర్సు దొంగతనం గురించి రైల్వే సిబ్బందితోపాటు హెల్ప్లైన్కు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఎవరూ సరిగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఆగ్రహించింది. రైల్వేతోపాటు ప్రభుత్వాన్ని తిట్టింది. ట్రేతో ఏసీ కోచ్ విండోను బ్రేక్ చేసింది. దీంతో అద్దం ముక్కలు అక్కడ చెల్లాచెదురుగా పడ్డాయి. ఆమె పిల్లవాడు కూడా పక్కనే ఉన్నాడు.
మరోవైపు ఆ కంపార్ట్మెంట్లో ప్రయాణించిన ఒకరు దీనిని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ మహిళ తీరుపై కొందరు మండిపడ్డారు. పక్కనే ఉన్న పిల్లవాడి భద్రత గురించి ఆమె పట్టించుకోకపోవడాన్ని కొందరు విమర్శించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సంఘటనపై రైల్వే ఇంకా స్పందించలేదు.
A woman broke a train window just because she lost her purse
And these are the same kinds of women who keep blaming the government every day for “bad facilities” and “poor infrastructure” pic.twitter.com/WVoM1MKP5T
— Saffron Chargers (@SaffronChargers) October 29, 2025
Also Read:
BJP MP Praveen Khandelwal | ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చండి.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ
woman gang-raped | మహిళపై మత్తు మందు చల్లి.. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
woman kills lover with fiance | కాబోయే భర్తతో కలిసి.. ప్రియుడ్ని చంపిన మహిళ
Watch: స్కూల్కు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు.. అతడ్ని ఎలా తీసుకెళ్లారంటే?