బెంగళూరు: ఆఫీస్‌లో లైట్ ఆర్పే విషయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఒక వ్యక్తి డంబెల్‌తో కొట్టి సహోద్యోగిని హత్య చేశాడు. (Man Kills Co-Worker) ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సినిమా షూటింగ్ వీడియోలను రోజువారీగా స్టోర్ చేసే డేటా డిజిటల్ బ్యాంక్ అనే సంస్థ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు శుక్రవారం నైట్ షిఫ్ట్‌లో పనిచేశారు.
కాగా, శనివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో లైట్ స్విచ్చాఫ్ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల సోమల వంశీ తన సహోద్యోగి భీమేష్ బాబు నుదుటపై డంబెల్‌తో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత గోవిందరాజ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన నిందితుడైన వంశీని పోలీసులు అరెస్ట్ చేశాడు. మృతుడు భీమేష్ బాబు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Ambulance Kills Couple | దూసుకొచ్చిన అంబులెన్స్.. స్కూటర్‌పై వెళ్తున్న దంపతులు మృతి
Women drown in beach | బీచ్‌లో ఆడుతూ.. సముద్రంలో మునిగి నలుగురు అమ్మాయిలు మృతి
Watch: స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు.. అతడ్ని ఎలా తీసుకెళ్లారంటే?