చెన్నై: నలుగురు అమ్మాయిలు బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లోని నీటిలో ఆటలు ఆడారు. బలమైన అలలకు ఒక యువతి కొట్టుకెళ్లింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు కూడా సముద్రంలో కొట్టుకుపోయారు. నీటిలో మునిగి మరణించారు. (Women drown in beach) మత్య్సకారుల సహాయంతో వారి మృతదేహాలను వెలికితీశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. గుమ్మిడిపుండిలోని ఒక బట్టల షాపులో పనిచేస్తున్న నలుగురు యువతులు శుక్రవారం చెన్నైలోని ఎన్నోర్ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఏకాంత ప్రాంతంలో ఆటలు ఆడారు.
కాగా, బీచ్ ఒడ్డున నీటిలో ఆడుతుండగా భారీ అలలకు 17 ఏళ్ల షాలిని కొట్టుకుపోయింది. 18 ఏళ్ల గాయత్రి, 19 ఏళ్ల భవాని, శ్రీలంక శరణార్థి అయిన 30 ఏళ్ల దేవకి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే భారీ అలలకు వారు కూడా సముద్రంలోకి కొట్టుకెళ్లారు. ఆ నలుగురూ నీటిలో మునిగి మరణించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఆ బీచ్ వద్దకు చేరుకున్నారు. మత్య్సకారుల సహాయంతో నలుగురు అమ్మాయిల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. పోస్ట్‌మార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్నోర్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Ambulance Kills Couple | దూసుకొచ్చిన అంబులెన్స్.. స్కూటర్‌పై వెళ్తున్న దంపతులు మృతి
woman kills lover with fiance | కాబోయే భర్తతో కలిసి.. ప్రియుడ్ని చంపిన మహిళ
Watch: రైలులో పర్సు చోరీ.. బాధిత మహిళ ఏం చేసిందంటే?