లక్నో: కుటుంబంలో గొడవల వల్ల ఒక వ్యక్తి ఇనుప రాడ్‌తో కొట్టి తన భార్యను హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న భార్య మృతదేహం వద్ద మూడేళ్ల బిడ్డను వదిలేశాడు. గదికి తాళం వేసి పారిపోయాడు. (Man Kills Wife) చిన్నారి ఏడ్పు విన్న కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మౌదహా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన ముయీనుద్దీన్ ప్రభుత్వ రేషన్ డీలర్. నాలుగేళ్ల కిందట 24 ఏళ్ల రోష్నిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
కాగా, శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ముయీనుద్దీన్ ఐరన్ రాడ్‌తో కొట్టి రోష్నిని హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న భార్య మృతదేహం పక్కన మూడేళ్ల బిడ్డను వదిలేశాడు. ఆ గదికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఆదివారం ఉదయం చిన్నారి ఏడ్పును కుటుంబ సభ్యులు విన్నారు. లాక్ వేసిన గది తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. రక్తంమడుగుల్లో పడి ఉన్న తల్లి మృతదేహం పక్కన ఆ చిన్నారి ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. రోష్ని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె హత్యపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముయీనుద్దీన్ కోసం వెతికి అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Swati Maliwal | పంజాబ్ ప్రభుత్వం పత్రికల పంపిణీ అడ్డుకున్నది: స్వాతి మలివాల్
Buffalo Worth Rs.21 Crore Dies | పశు ప్రదర్శనలో ఆకట్టుకున్న రూ.21 కోట్ల గేదె.. అనారోగ్యంతో మృతి
Watch: అదుపుతప్పి రౌండ్ తిరిగి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు మృతి
Watch: ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్