చండీగఢ్: పంజాబ్ ప్రభుత్వం నియంతృత్వం శిఖరాగ్రానికి చేరిందని రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal) ఆరోపించారు. ‘శీష్ మహల్ 2.0’ వివాదం (‘Sheesh Mahal 2.0’ Row) నేపథ్యంలో వార్తాపత్రికల పంపిణీని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చండీగఢ్‌లోని సెక్టార్ 2లో పంజాబ్ సీఎం కోసం ఉద్దేశించిన విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాను కేజ్రీవాల్‌కు కేటాయించినట్లు ఆమె ఆరోపించారు. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ 2.0’గా స్వాతి మలివాల్ అభివర్ణించారు. ఢిల్లీకి చెందిన ఆప్ మాజీ మంత్రులకు కూడా అక్కడ మరికొన్ని ప్రభుత్వ బంగ్లాలను పంజాబ్ ప్రభుత్వం కేటాయించిందని, అధికారాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు.
కాగా, ‘శీష్ మహల్ 2.0’పై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియా కవరేజీని అడ్డుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు స్వాతి మలివాల్ ఆదివారం ఆరోపించారు. ‘షాకింగ్! ఈ ఉదయం అనేక ప్రాంతాలలో వార్తాపత్రికల పంపిణీని నిరోధించడానికి పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు సమాచారం. అరవింద్ కేజ్రీవాల్ ‘శీష్ మహల్ 2.0’ గురించిన వార్తలు పంజాబ్ అంతటా దావానలంలా వ్యాపిస్తుండటంతో ఇదంతా జరుగుతోంది’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
మరోవైపు తన ఆరోపణలను కవర్ చేసినా లేదా తన పేరును ప్రస్తావించినట్లయితే ప్రభుత్వ ప్రకటనలు ఉపసంహరిస్తామని మీడియా సంస్థలను పంజాబ్ ప్రభుత్వం బెదిరిస్తున్నదని స్వాతి మలివాల్ ఆరోపించారు. ‘నియంతృత్వం పరాకాష్టకు చేరింది’ అని ఎక్స్ పోస్ట్‌లో ఆమె మండిపడ్డారు. వార్తాపత్రికల పంపిణీని పోలీసులు అడ్డుకుంటున్న వీడియో క్లిప్‌ను ఆమె పోస్ట్ చేశారు.
Shocking‼️
This morning, Punjab government has reportedly attempted to block the distribution of newspapers across several areas. All this is happening because the news about Arvind Kejriwal ji’s Sheesh Mahal 2.0 is spreading like wildfire throughout Punjab.Media houses are… pic.twitter.com/ctMJnnwYNX
— Swati Maliwal (@SwatiJaiHind) November 2, 2025
Also Read:
Buffalo Worth Rs.21 Crore Dies | పశు ప్రదర్శనలో ఆకట్టుకున్న రూ.21 కోట్ల గేదె.. అనారోగ్యంతో మృతి
Man Kills Co-Worker | ఆఫీస్‌లో లైట్ ఆర్పే విషయంలో గొడవ.. సహోద్యోగిని హత్య చేసిన వ్యక్తి
Women drown in beach | బీచ్‌లో ఆడుతూ.. సముద్రంలో మునిగి నలుగురు అమ్మాయిలు మృతి
Ambulance Kills Couple | దూసుకొచ్చిన అంబులెన్స్.. స్కూటర్‌పై వెళ్తున్న దంపతులు మృతి