నమస్తే ఫొటోగ్రాఫర్‌కు అవార్డ్.. ఆన్ న్యూస్ 2.0 ఫొటో కాంటెస్ట్‌లో మూడో బహుమతి కైవసం
జాతీయ స్థాయిలో తెలంగాణ ఫొటో జర్నలిస్టులు మరోసారి సత్తా చాటారు. కర్ణాటక మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక చిత్రకళా ఆర్ట్ గ్యాలరీ వేదికగా నిర్వహించిన ‘ఫోకస్ ఆన్ న్యూస్ 2.0 ఫొటో కాంటెస్ట్' ఫలితాలను నిర్వహకులు సోమవారం ప్రకటించారు.
- కర్ణాటక మీడియా అకాడమీ ఫోకస్
హైదరాబాద్,ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో తెలంగాణ ఫొటో జర్నలిస్టులు మరోసారి సత్తా చాటారు. కర్ణాటక మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక చిత్రకళా ఆర్ట్ గ్యాలరీ వేదికగా నిర్వహించిన ‘ఫోకస్ ఆన్ న్యూస్ 2.0 ఫొటో కాంటెస్ట్’ ఫలితాలను నిర్వహకులు సోమవారం ప్రకటించారు. ఈ పోటీల్లో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక డిప్యూటీ చీఫ్ ఫొటో జర్నలిస్ట్ వీరగోని రజినీకాంత్ గౌడ్ తృతీయ బహుమతిని సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ఫొటో పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 250 ఎంట్రీలు రాగా, కఠినమైన వడపోత తర్వాత కేవలం 50 ఫొటోలు మాత్రమే ఫైనల్స్‌కు ఎంపికయ్యాయి.
ఇందులో యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం రెండే రెండు ఫొటోలు తుది జాబితాలో స్థానం దకించుకున్నాయి. ఫైనల్స్‌కు చేరిన 50 అత్యుత్తమ ఫొటోలలో కేవలం మూడింటికి మాత్రమే జ్యూరీ బహుమతులు ఖరారు చేసింది. ఇందులో మొదటి బహుమతి కేరళ రాష్ట్రానికి దకగా, రెండో బహుమతి ముంబై నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ను వరించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ‘నమస్తే తెలంగాణ’ డిప్యూటీ చీఫ్ ఫొటో జర్నలిస్ట్ వీరగోని రజినీకాంత్ గౌడ్ మూడో బహుమతిని సొంతం చేసుకున్నారు. విజేతలకు బహుమతి ప్రదానోత్సవం బెంగళూరులోని చిత్రకళా పరిషత్ ఆర్ట్ గ్యాలరీలో జరగనుంది. మూడో బహుమతికి ఎంపికైన రజినీకాంత్ గౌడ్‌ను పలువురు అభినందించారు.
తెలంగాణ నుంచి ఎంపికైన రెండో ఫొటో కూడా ‘నమస్తే తెలంగాణ’దే
తెలంగాణ నుంచి ఎంపికైన రెండో ఫొటో కూడా నమస్తే తెలంగాణ ఫొటో గ్రాఫర్ తీసినదే కావడం విశేషం. మహబూబ్‌నగర్ జిల్లా ఫొటోగ్రాఫర్ బందిగె గోపి తీసిన ఫొటో చిత్రకళా ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో పలువురు బందిగె గోపిని అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

