తిరువనంతపురం: మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కదులుతున్న రైలు నుంచి ఆమెను బయటకు తోసేశాడు. రైలు పట్టాల పక్కన పడిన ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. (Woman Pushed Of Moving Train) ఆ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఒక మహిళ తన స్నేహితురాలితో కలిసి తిరువనంతపురం వెళ్లేందుకు అలువా రైల్వే స్టేషన్లో కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రాత్రి 8.30 గంటల సమయంలో వర్కళ రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలు బయలుదేరింది.
కాగా, మహిళ, ఆమె స్నేహితురాలు టాయిలెట్‌కు వెళ్లి బయటకు వచ్చారు. మద్యం సేవించి కంపార్ట్మెంట్ డోర్ వద్ద ఉన్న ఒక వ్యక్తి ఆ మహిళను కాలితో తన్ని కదులుతున్న రైలు నుంచి బయటకు తోశాడు. దీంతో రైలు పట్టాల పక్కన ఆమె పడింది. మహిళ స్నేహితురాలిని కూడా రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. హ్యండిల్‌ను గట్టిగా పట్టుకున్న ఆమె వేలాడగా కొందరు ప్రయాణికులు లోపలకు లాగి కాపాడారు. ఆ వ్యక్తిని పట్టుకుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు ప్రయాణికుల సమాచారంతో రైల్వే పోలీసులు స్పందించారు. వర్కళ రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాల వద్ద పడిన ఆ మహిళను గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు.
కాగా, ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడైన సురేష్‌ను కొచువేలి స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతడు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించామన్నారు. మహిళ స్నేహితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Fake Doctors Hub | నకిలీ డాక్టర్లకు అడ్డాగా ఆ జిల్లా.. మూడు నెలల్లో 17 మంది అరెస్ట్
Watch: ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్