అహ్మదాబాద్: ఒక వ్యక్తి తన భార్యతో పాటు ప్రియురాలిని హత్య చేశాడు. వారి మృతదేహాలను ఒకేచోట పడేశాడు. ప్రియురాలి హత్య కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేయగా భార్యను కూడా అతడు చంపాడని తెలుసుకుని షాక్ అయ్యారు. (man kills wife, girlfriend) గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 29న నవ్‌సరి జాతీయ రహదారి సమీపంలోని నిర్జన రైస్ మిల్లు సమీపంలో రక్తంతో తడిసి నగ్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఫైసల్ పఠాన్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
కాగా, ఫైసల్ పఠాన్‌ను పోలీసులు ప్రశ్నించారు. దీంతో షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఏడాది కిందట ప్రియురాలు రియా పరిచయమైనట్లు తెలిపాడు. నిర్జన మిల్లులో తరచుగా కలుసుకున్నట్లు చెప్పాడు. అక్టోబర్ 28న రియా అక్కడకు వచ్చినట్లు తెలిపాడు. డబ్బుల విషయంపై గొడవ నేపథ్యంలో ఆమెను హత్య చేసి మృతదేహన్ని అక్కడ పడేసినట్లు వెల్లడించాడు.
మరోవైపు మూడు నెలల కిందట తన భార్య సుహానాను కూడా హత్య చేసినట్లు ఫైసల్ పఠాన్ పోలీసులకు చెప్పాడు. తమ సంబంధాన్ని ఆమె కుటుంబం అంగీకరించకపోవడంతో జూలైలో విడిపోయినట్లు తెలిపాడు. ఆ తర్వాత సుహానాను మిల్లు వద్దకు పిలిచినట్లు చెప్పాడు. అక్కడకు వచ్చిన ఆమెను హత్య చేసి మృతదేహాన్ని అక్కడ వదిలేసినట్లు వెల్లడించాడు.
కాగా, పోలీసులు ఆ మిల్లు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న ఒక అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్స్ పరీక్ష కోసం పంపారు. భార్య, ప్రియురాలిని హత్య చేసిన ఫైసల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
BJP leader missing | బీజేపీ నేత అదృశ్యం.. అక్రమంగా పోలీస్ కస్టడీలో ఉంచినట్లు కుటుంబం ఆరోపణ
Woman Pushed Of Moving Train | కదులుతున్న రైలు నుంచి.. మహిళను బయటకు తోసిన ప్రయాణికుడు