తిరుమల :తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆపదమొక్కులవాడు వేంకటేశ్వర స్వామిని ( Lord Venkateshwar Swamy) దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ ( TTD ) అధికారులు వివరించారు.
సోమవారం 66,322 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 26 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.74 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తిరుమల శ్రీవారికి మంగళవారం రూ.30 లక్షలు విలువైన 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు.ఈ మేరకు శ్రీవారి ఆలయం ముందు ఆలయ అధికారులకు గంగాళాన్ని అందజేశారు.