moto g67 Power | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఫోన్‌ను లాంచ్ చేసిన మోటోరోలా.. ధర తక్కువే..!
ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు భారీ బ్యాటరీ కెపాసిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వినియోగదారులు కూడా అలాంటి ఫోన్లను కొనుగోలు చేసేందుకే ఆసక్తిని చూపిస్తున్నారు.
moto g67 Power | ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు భారీ బ్యాటరీ కెపాసిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వినియోగదారులు కూడా అలాంటి ఫోన్లను కొనుగోలు చేసేందుకే ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం చాలా వరకు ఫోన్లలో 7000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. ఇక ఇదే కోవలో మోటోరోలా కూడా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో మోటో జి67 పవర్ పేరిట విడుదల చేసింది. జి పవర్ సిరీస్‌లో మోటోరోలా లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
16జీబీ వరకు వర్చువల్ ర్యామ్..
మోటో జి67 పవర్ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 16జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా మరో 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీనికి గాను 1 ఓఎస్ అప్డేట్ను అందిస్తామని, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయని కంపెనీ చెబుతోంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌కు ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఇచ్చారు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అందువల్ల ఫోన్ కింద పడినా అంత సులభంగా పగలదు. ఇక ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ ఇందులో ఉన్న బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇందులో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. కనుక 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి గాను 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 128జీబీ సింగిల్ వేరియెంట్ ఆప్షన్లో మాత్రమే ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఇచ్చారు. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ లభిస్తుంది. కనుక ఆడియో చాలా క్వాలిటీగా ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను రూపొందించారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
ధర వివరాలు..
మోటోరోలా మోటో జి67 పవర్ స్మార్ట్ ఫోన్‌ను పాంటోన్ సిలాంట్రో, పాంటోన్ క్యురాకోవా బ్లూ, పాంటోన్ పారాచూట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఆన్లైన్ స్టోర్, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో నవంబర్ 12 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను సైతం అందిస్తున్నారు. ఎస్బీఐ లేదా యాక్సిస్ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.1000 డిస్కౌంట్ ఇస్తారు. మరో రూ.1000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం సైతం అందుబాటులో ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

