Vegan diet | శాకహారులుగా మారిపోతున్న అందాల భామలు.. వీగన్ డైట్ గురించి బాలీవుడ్ సెలబ్రెటీలు ఏమంటున్నారంటే..
Vegan diet | వీగనిజమ్ ఒక ట్రెండ్‌గా మారుతున్నది. జంతుప్రేమికులు, పర్యావరణ ఉద్యమకారులకు తోడు సినీతారలు కూడా ‘వీగనిజమ్ జిందాబాద్’ అంటున్నారు. శుద్ధ శాకాహారుల సంఘం గ్లామర్ తళుకులతో మెరిసిపోతున్నది.
నా సౌందర్య రహస్యం : ఆలియా భట్
పర్యావరణ పరిరక్షణ కోసం ఆన్లైన్ ఉద్యమం చేస్తున్నది.. బాలీవుడ్ నటి ఆలియా భట్. తను చాలా రోజుల క్రితమే వీగన్‌గా మారింది. రాజీ, హైవే వంటి చిత్రాలతో అలరించిన ఆలియా ‘వీగనిజమే నా సౌందర్య రహస్యం’ అని ప్రకటించింది. జీవితకాలం ఈ మార్గంలోనే నడుస్తానని చెబుతున్నది. ఇదంతా నాన్న మహేశ్ భట్ ప్రభావమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సకుటుంబంగా.. : వామిక
శాకపాకాలే ఆరోగ్యకరమైన ఆహారమని మనసా వాచా నమ్ముతున్నది పంజాబీ బ్యూటీ వామిక. వీగనిజానికి కొనసాగింపుగా.. కేవలం సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారాన్నే ఆరగిస్తున్నది వామిక. ఆమె ఎంచుకొనే సౌందర్య సాధనాలు కూడా ఆర్గానిక్ ముద్ర ఉన్నవే. కుటుంబ
సభ్యులు, స్నేహితులను కూడా వీగనిజం వైపు మళ్లించింది. అదీ పట్టుదల అంటే!
హింసలేని ప్రపంచం కోసం : సోనాక్షీ సిన్హా
పక్కా వీగన్‌గా మారకముందు సోనాక్షి మహా బొద్దుగా ఉండేది. ‘జై వీగనిజం’ నినాదాన్ని అందుకున్నాకే స్లిమ్‌గా మారింది. ఈ ఆహార విధానం వల్ల తన జీవక్రియ మెరుగుపడిందని చెబుతున్నది సోనాక్షి. జంతుహింసను తను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. క్రూరత్వం లేని ప్రపంచాన్ని చూడాలన్న కోరికే తనను శుద్ధ శాకాహారిని చేసిందని అంటున్నది.
జంతువుల మీద ప్రేమతో : ఈషా గుప్తా
జంతురక్షణ కోసం గత కొంత కాలంగా పనిచేస్తున్నది ఈషా. రెండేండ్ల క్రితం మొదలుపెట్టిన వీగన్ జీవన శైలిని జీవితాంతం కొనసాగించేందుకు సిద్ధపడింది. ‘గో గ్రీన్.. గో
వెజిటేరియన్’ అంటూ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా)- ఇండియా తరపున ప్రచారం చేస్తున్నది.
‘నేను శాకాహారిగా
మారిపోయి.. ఎన్నో మేకలూ, కోళ్లను బతికించగలిగాను’ అంటున్నది. శాకాహారం వంటికే కాదు, పర్యావరణానికి కూడా మంచిదని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది ఈ బాలీవుడ్ నటి.
మనసుకూ మంచిదే : శ్రద్ధా కపూర్
‘ప్రకృతిని మనం రక్షిస్తే.. ప్రకృతి మనల్ని రక్షిస్తుంది’ అన్నది శ్రద్ధా కపూర్ నినాదం. ఆమె ప్రస్తుతం ఏక్దమ్ వీగనిస్టు. మనిషి కారణంగానే భూగ్రహం కష్టాలపాలు అవుతున్నది. ఆ చెడును నిర్మూలించడానికైనా మనం శాకాహారిగా మారాల్సిందే అనేది ఆమె ఉద్దేశం. వీగనిజం మన ఆలోచనల్ని కూడా ప్రభావితం చేస్తుంది. నెగెటివ్ నుంచి పాజిటివ్ వైపుగా నడిపిస్తుందని శ్రద్ధగా నమ్ముతుంది శ్రద్ధ.
ఆకృతి కోసం.. : సహేర్ బాంబా
అందమైన శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి వీగనిజాన్ని మించిన మార్గం లేదంటున్నది సిమ్లా బ్యూటీ సహేర్ బాంబా. తన అందం, ఆరోగ్యం, ఫిట్నెస్ రహస్యం కూడా అదేనని ఢంకా బజాయిస్తున్నది. మనం చేసే చిన్నచిన్న పనులే.. సమాజంలో పెద్దమార్పును తీసుకొస్తాయన్న సహేర్ నమ్మకం సహేతుకమైనదే.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- bollywood
- Food
- vegan
- vegan diet
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

