డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!
Summer Food | వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందుకోసం మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ తాగాలని చెప్తుంటారు. అయితే, ద్రవాలు మాత్రమే కాదు, కొన్ని రకాల ఘనపదార్థాలు కూడా శరీరంలో వేడిని తగ్గిస్తాయి. వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందొచ్చు.

♦ వేడి తగ్గించడంలో సత్తుపిండి విశేషంగా పనిచేస్తుంది. ఉదయం అల్పాహారంగా సత్తుపిండి-మజ్జిగ, సత్తుపిండి-పాలు తీసుకుంటే కడుపు చల్లగా ఉంటుంది. రాత్రిపూట సత్తుపిండి రొట్టెలు తీసుకుంటే మంచిది. జొన్నలు, రాగులతో తయారుచేసే సత్తుపిండి వల్ల శరీరానికి చల్లదనంతోపాటు పోషకాలు కూడా అందుతాయి.

♦ వేసవిలో ఆకుకూరలను రోజూ తినాలి. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా చలువ చేస్తాయి. ఇవి శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తాయి. వీటితోపాటు కీరదోస, క్యారెట్, బీట్‌రూట్‌లతో సలాడ్స్ తీసుకోవాలి.

♦ శరీరంలో వేడిని తగ్గించడంలో పనసపండు బాగా పనిచేస్తుంది. వేసవిలో పనసతొనలతో మిల్క్‌షేక్ చేసుకుని తాగొచ్చు. పెరుగు, చక్కెర, పనస పండు గుజ్జుతో చేసిన స్మూతీ కూడా రుచిగా ఉంటుంది. పనసలో ప్రొటీన్లు,కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలనూ తగ్గిస్తాయి. దీనిని ‘మాంసానికి ఉత్తమ ప్రత్యామ్నాయ ఆహారం’ అంటారు.

♦ మన దేశంలో చాలాచోట్ల కిళ్లీల్లో ఉపయోగించే గుల్కంద్ (గులాబి రేకులను ఉడికించి తయారుచేస్తారు) ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. యునాని వైద్య విధానంలో వేడిని తగ్గించేందుకు గుల్కంద్ను ఉపయోగిస్తారు. వేడి వల్ల కలిగే మంట, దురదను ఇది దూరం చేస్తుంది.
Read More :
Health Tips | సమ్మర్ హీట్‌ను ఈ డ్రింక్స్‌తో బీట్ చేద్దాం..!”
“Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఈ సమ్మర్లో పుచ్చ కాయ తినొచ్చా?”
“Summer Food | సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా”
“Taati munjalu | డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Health
- Healthy food
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

