Taati munjalu | డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!
తాటిముంజలు | తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే ప్రత్యేకం. తాటిముంజలకు అంతర్జాతీయంగానూ పేరుంది. ‘ఐస్ ఆపిల్స్’ అంటూ ఆపిల్ పండ్లకు సమానమైన
తాటిముంజలు , నీటిముంజలు, పాలముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలం వచ్చిందంటే చాలు పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్లతెల్ల ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తాయి, నోరూరిస్తాయి. తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే ప్రత్యేకం. తాటిముంజలకు అంతర్జాతీయంగానూ పేరుంది. ‘ఐస్ ఆపిల్స్’ అంటూ ఆపిల్ పండ్లకు సరిసమానమైన స్థానం ఇచ్చారు. పోషకాల్లో మేటి అయిన ముంజల ముచ్చట్లు..

తాటిముంజలు తినడం కూడా ఓ స్టైలే. పట్టణాలు, నగరాల్లో స్పూన్లు, ఫోర్కులతో తింటారు. కానీ, పల్లెల్లో అప్పటికప్పుడు తాటికాయ ఒలిచి బొటన వేలితో తీసుకుని తింటుంటే ఆ మజాయే వేరు. తాటిముంజల్ని ‘తాటికన్నులు’ అనీ అంటారు. మార్కెట్లో ముంజలకు గిరాకీ ఉండటంతో వ్యాపారులు ఏడాదంతా లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంజల్ని బాగా శుభ్రపరచి నిల్వచేస్తారు.

కొబ్బరిని ఇష్టపడే వాళ్లంతా తాటిముంజల్నీ ఇష్టపడతారు. దీని రుచి లేత కొబ్బరి మాధుర్యాన్ని తలపిస్తుంది. గర్భధారణ సమయంలో ఎదురయ్యే చాలా సమస్యలకు ముంజలే మంచి ఔషధాలని అంటారు. అలసిన వేళ ముంజలు మహాశక్తినిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వేసవిలో తాటి
ముంజలకు జైకొడదాం.

తాటి చెట్టు తల్లి అయితే, తాటిముంజలు పిల్లలు. వేసవి అంటేనే మండే ఎండలు. భానుడి ప్రతాపం నుంచి బయట పడేందుకు రకరకాల దారులు వెతుకుతుంటారు. కడుపులో ‘చల్లచల్లగా ఏం వేద్దామా’ అని ఎదురు చూస్తుంటారు. ఎండవేడిమిని తట్టుకునేందుకు ఓ చక్కటి పరిష్కారం తాటిముంజలు. వీటిలో నీటి శాతం పుష్కలం. నాలుగు ముంజలు గుటుక్కుమనిపిస్తే ‘డీహైడ్రేషన్’ సమస్యే ఉండదని నిపుణులు తేల్చారు. అదనంగా తక్షణ ఎనర్జీ!

పాల ముంజలతో వంటలుకూడా చేసుకోవచ్చు. ప్రాంతాలు, పద్ధతులనుబట్టి కొందరు వీటిలో సగ్గుబియ్యం, బెల్లం వేసి వండుతారు. చూసేందుకు అచ్చం పాయసంలా కనిపిస్తూ నోరూరిస్తుందీ వంటకం. పాయసం వండేసి, చివర్లో ముంజల్ని చిన్నచిన్న ముక్కల్లా తరిగి పైనుంచి వేస్తారు. వీటితో స్వీట్లు, జ్యూస్, లస్సీలు, సలాడ్‌తోపాటు చికెన్, మటన్ వంటలనూ వండేస్తున్నారు. మసాలా ఘాటుతో నోరూరిస్తున్నారు.

తాటి ముంజల వల్ల మేలు అంతా ఇంతా కాదు. మన దాహార్తిని తీర్చి, శరీరానికి చల్లదనాన్నిస్తాయి. ఎన్నో పోషకాలనూ అందిస్తాయి. తాటిముంజల్లో విటమిన్-బి, ఐరన్, క్యాల్షియం పుష్కలం. వీటిలోని నీరు అధిక బరువు సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తాటిముంజల్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి ఎండకాలం మొహం మీద పొక్కులు వస్తుంటాయి. ముంజల్ని కనుక తింటే, ఆ ఇబ్బంది ఉండదని నిపుణులు అంటారు.

తాటి ముంజలకు ఔషధగుణం ఉంది. లివర్ సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. వీటిలోని పొటాషియం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఒంట్లోని ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వయసు పైబడిన వారికి ఇవి మరింత మంచి ఆహారం.
– నవీన్ కుమార్ రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
Kedarnath Dham Yatra | ముగింపు దశలోనూ కేదార్ నాథ్ ధామ్‌కు తగ్గని యాత్రికులు
తిమ్మాపురంలో భూముల రీ సర్వే పరిశీలన
Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

