రాత్రుళ్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా.. ఒకసారి ఇలా చేసి చూడండి..
Poppy Seeds Health Benefits | గసగసాల్ని రోజూ వంటల్లో వాడుతుంటాం. కానీ పూర్వం వీటిని మందుల తయారీలో వాడేవాళ్లు. మిగతా సుగంధ ద్రవ్యాల్లాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలామంది వాటిని వాడటానికి ఆసక్తి చూపరు. మరి గసగసాల్లో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీరు తెలుసుకోండి..

– కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు.. క్యాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.
– రోజూ వంటల్లో గసగసాల్ని వాడడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది. గసగసాల్లో ఫైబర్ (పీచు పదార్థం ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. దీంతో మలబద్దక సమస్య తగ్గుతుంది.
– రోజూ ఆహారంలో గసగసాల్ని వాడడం వల్ల నిద్రలేమి సమస్య దరిచేరదు. రోజూ పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పొడిని కొద్దిగా వేసుకొని తాగితే చాలు చక్కగా నిద్ర వస్తుంది.

– శ్వాస సంబంధిత సమస్యలు కూడా గసగసాలతో తొలిగిపోతాయి. అస్తమా, దగ్గు ఉన్న వారికి ఇవి బాగా పనిచేస్తాయి.
– గుండె సమస్యలు ఉన్నవారు గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి, చక్కెర కలుపుకొని ఉదయం సాయంత్రం, అరచెంచాడు తీసుకుంటే గుండెపనితీరు మెరుగుపడుతుంది.
– గసగసాలు చలువ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడితే ఉపశమనం పొందొచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారు గసగసాల్ని వాడితే పేగుల్లో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయి.
Read More :
ఏవైపు తిరిగి పడుకుంటే మంచిది?”
“Short Sleep | తక్కువ నిద్రతో ఆరోగ్యంగా ఎలా ఉండగలరు?”
Sleep | కంటి నిండా నిద్ర ఉండట్లేదా? అయితే ఈ ముప్పు తప్పదు”
“నిద్రపోయే ముందు ఇవి తింటున్నారా? ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు”
“నిద్ర సరిగ్గా పట్టట్లేదా ? కంటి చూపు దెబ్బతినొచ్చు జాగ్రత్త !”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

