ఏవైపు తిరిగి పడుకుంటే మంచిది?
Sleep | మనం రకరకాల భంగిమల్లో నిద్రపోతాం. కుడి, ఎడమలు తిరిగి తిరిగి పడుకుంటాం. వెల్లకిలా, బోర్లా తిప్పి తిప్పి పడుకుంటాం. అయితే ఒత్తిగిలి పడుకోవడం, అందులోనూ ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు.
→ మన పొట్టలో ఎడమవైపు జీర్ణాశయం, క్లోమగ్రంథి ఉంటాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు అవి భూమ్యాకర్షణ శక్తికి లోనై వేలాడినట్టుగా అవుతాయి. దానివల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
→ ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల రోగ నిరోధకతను బలోపేతం చేసే శోషరస వ్యవస్థ కూడా ఉత్తేజితం అవుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక పదినిమిషాలు ఎడమవైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిది.
→ గుండె శరీరానికి ఎడమభాగంలోనే ఉంటుంది. కాబట్టి అటువైపు తిరిగి పడుకోవడం వల్ల రక్త ప్రసరణ సులభం అవుతుంది. గుండెకూ కొంతమేర విశ్రాంతి దొరికినట్టు అవుతుంది.
→ గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల పిండానికి, గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కడుపులో ఉన్న బిడ్డకు నేరుగా పోషకాలు చేరతాయి. ఇలా పడుకోవడంతో వెన్నెముక మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. తద్వారా సౌకర్యంగా అనిపించి నిద్ర బాగా పడుతుంది. అందుకే గర్భిణులు వీలైనంత సేపు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదంటారు ఆయుర్వేద వైద్యులు. ఒత్తిగిలి పడుకున్నప్పుడు మోకాళ్లు దగ్గరికి మడిచి కాళ్ల మధ్యలో దిండు పెట్టుకుంటే మరింత సౌకర్యంగా నిద్ర పోవచ్చు.
→ గురక సమస్య ఉన్నవారికి ఈ భంగిమ మేలు చేస్తుంది. ఇలా తిరిగి పడుకోవడం వల్ల నాలుక, గొంతు సమాంతర స్థితిలో ఉంటాయి. శ్వాస సులభం అవుతుంది. గురక చాలా వరకు తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ చక్కగా పనిచేసేందుకూ ఈ భంగిమ తోడ్పడుతుంది.
Read More :
“Short Sleep | తక్కువ నిద్రతో ఆరోగ్యంగా ఎలా ఉండగలరు?”
“నిద్రపోయే ముందు ఇవి తింటున్నారా? ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు”
Sleep | కంటి నిండా నిద్ర ఉండట్లేదా? అయితే ఈ ముప్పు తప్పదు”
“‘కరోనాసోమ్నియా’ అంటే ఏమిటి…?దానికి పరిష్కారాలేంటి…?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- sleep
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

