‘కరోనాసోమ్నియా’ అంటే ఏమిటి…?దానికి పరిష్కారాలేంటి…?

హైదరాబాద్,మే 27; కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చాలా మందిలో నిద్రలేమిసమస్యను ఎదుర్కొంటున్నారు.కరోనా వచ్చి పోయినవారు, రానివారు సైతం నిద్ర సరిగా పట్టడంలేదని చెబుతున్నారు. ఈ మహమ్మారి సమయంలో రాత్రి విశ్రాంతి పొందేవారికి సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా మహమ్మారి భయాందోళనల కారణంగా నిద్రలేమి సమస్య ను వైద్యనిపుణులు ‘కరోనాసోమ్నియా’గా పిలుస్తారు.
ఈ సమస్య ఎందుకు తలెత్తుతుంది…?

కొరోనాసోమ్నియా మహమ్మారి సమయంలో నిద్ర లేమిసమస్యలు పెరగడమేకాకుండా, ఆందోళన, నిరాశ ,ఒత్తిడి లక్షణాలు పెరగడంతో చాలామందిలో ‘కరోనాసోమ్నియా’ తీవ్రత పెరుగుతున్నది. కరోనా ఒత్తిడితో ముడిపడి ఉండడంతోపాటు నిద్రలేమి, ఆర్థిక సమస్యలు, ‘కరోనాసోమ్నియా’ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్రజల ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీసింది. ముఖ్యంగా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా నెలలపాటు సామాజిక దూరం, సోషల్ లైఫ్ లేదు, ఇంటి నుంచి పని, శారీరక వ్యాయామం లేకపోవడం, కరోనా చుట్టూ తిరిగే మానసిక ఉద్రిక్తతలు, నిస్సహాయత, ఆర్థిక సమస్యలు, జీవితంలో అనిశ్చితి పరిణామాలను కలిగి ఉండడంతో నిద్ర సరిగా పట్టడం లేదు.
తక్కువ నిద్రతో అనర్థాలే…

తక్కువ నిద్ర అలసటను కలిగించడమే కాకుండా, ఊబకాయం కాయం, ఆందోళన, రక్తపోటు, నిరాశ, గుండె సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలకు దారితీస్తుంది. రాత్రి ఏడు గంటల కన్నా తక్కువ నిద్రించే వారిలో రోజంతా వారు చేసే పని నాణ్యత పై ప్రభావితం చూపిస్తుందనివైద్యనిపుణులుచెబుతున్నారు.నిద్రలేమిసమస్యఏకాగ్రతనుదెబ్బతీస్తుందని,ఆరోగ్యసమస్యనుపెంచడమేకాకుండా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అంతేకాదు నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతోపాటు COVID-19 వైరస్‌కు మరింత బలాన్ని ఇచ్చేఅవకాశం ఉంది. ఇది మరింత ఆందోళన, ఒత్తిడికి దారితీస్తుంది.
దీనికి సరైన పరిష్కారాలేంటి…?
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. రోజూ తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సంగీతం, ఆర్ట్స్, పుస్తక పఠనం వంటి కొన్ని అభిరుచులను పెంచుకోవాలి. ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర తప్పనిసరిగా పోవాలి. ప్రతిరోజూ ఉదయం సూర్యకాంతి శరీరంపై పడేలా చూసుకోవాలి. మద్యపానాన్ని తగ్గించండి. ఆల్కహాల్ ఉపశమనకారి కావచ్చు, కానీ ఇది మీ నిద్ర కు భంగం కలిగిస్తుంది, తద్వారా నిద్ర తక్కువ పడుతుంది. కాఫీ,టీలు నిద్రించే సమయంలో చాలావరకు తగ్గించాలి. రాత్రి భోజనంతొందరగా తినండి.ఆలస్యంగా తినడం మానుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహరం తినండి. ఇది రాత్రి సమయంలో తొందరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. తద్వారా రాత్రికి హాయిగా నిద్ర పడుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

