నిద్ర సరిగ్గా పట్టట్లేదా ? కంటి చూపు దెబ్బతినొచ్చు జాగ్రత్త !
కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం ! కానీ ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు !! ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారే ఎక్కువగా

కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం ! కానీ ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు !! ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారే ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రతి పది మందలో ఒకరు ఈ నిద్రలేమితో బాధపడుతున్నారని సైకాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు నిద్రలేమికి గల కారణాలేంటి? నిద్రకు, కంటి సమస్యలకు గల సంబంధం ఏంటి అనే విషయాలపై అధ్యయనం చేసిన ఆస్ట్రేలియాలో ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకులు.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రతిరోజు చీకటి పడగానే మనందరిలోనూ మెలటోనిన్ అనే హర్మోన్ విడుదల అవుతుంది. ఇది శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. మన జీవ గడియారంలో మెలటోనిన్ది కీలకపాత్ర. మయోపియా ( హ్రస్వదృష్టి ) ఉన్నవారిలో మెలటోనిన్ చాలా నిదానంగా స్రవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇదే వారిలో నిద్రలేమికి దారితీస్తున్నదని గుర్తించారు. ఈ పరిశోధన కంటిచూపునకూ మెలటోనిన్కు మధ్య బంధాన్ని స్పష్టం చేసింది.
ఎలాగైతే మయోపియా వల్ల నిద్రలేమి కలుగుతుందో, అలాగే నిద్రలేమి వల్ల కూడా హ్రస్వ దృష్టి ఏర్పడుతుందని పరిశోధకులు నిర్ధారించారు. నగరాల్లోని కృత్రిమ వెలుతురు, మొబైల్ నుంచి వెలువడే నీలం కాంతి ఇవన్నీకూడా మెలటోనిన్ మీద ప్రభావం చూపుతాయని, ఫలితంగా పిల్లల్లో కూడా హ్రస్వదృష్టి సమస్య తలెత్తుతున్నదనీ హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుచ్చకాయ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి
షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

