పుచ్చకాయ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి

ఎండాకాలంలో విరివిగా కనిపించే పండ్లలో ఒకటి పుచ్చకాయ. వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో వీటిని మించి మరొకటి లేదనే చెప్పొచ్చు. 95 శాతం వరకు నీరే ఉన్న ఈ పండును తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. అందుకే సమ్మర్ వచ్చిందంటే వీటికి గిరాకీ బాగుంటుంది. అయితే వీటిలో ఎలాంటి కాయలను కొనాలి? ఏవి ఎర్రగా, మంచి రుచితో ఉంటాయో చాలా మంది గుర్తించలేరు. దీంతో అమ్మేవాడు చెప్పిన కాయలు తెచ్చి ఒక్కోసారి మోసపోతుంటారు. అందుకే పుచ్చకాయలను కొనేముందు ఈ చిట్కాలు ఫాలో అయితే మంచి కాయను కొనుక్కోవచ్చు.

పుచ్చకాయలో ఆడ, మగ కూడా ఉంటాయి
అవునండి! పుచ్చకాయలో ఆడ, మగ జాతులు కూడా ఉంటాయి. ఆడ పుచ్చకాయలు చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. మగ పుచ్చకాయలు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. వీటిలో నీటి శాతం, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. అదే తియ్యటి కాయ కావాలంటే ఆడపుచ్చ కాయను తీసుకోవడం మేలు.

సైజ్‌తో సంబంధం లేదు
పుచ్చకాయ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుందని చాలామంది అపోహ పడతారు. కానీ అది నిజం కాదు.. పుచ్చకాయ రుచికి దాని పరిమాణానికి సంబంధం లేదు. కాయ ఏ సైజ్‌లో ఉన్నా సరే.. పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి. అలా బరువుగా ఉంటే కాయ లోపల నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడూ సాధారణ సైజ్‌లో ఎక్కువ బరువు ఉన్న కాయలనే ఎంచుకోవాలి.

రంగు
చాలామంది పచ్చగా కనిపించే పుచ్చకాయలను కొంటుంటారు. అవి తాజాగా ఉంటాయని అనుకుంటారు. కానీ అలాంటి కాయలు పూర్తిగా పండక.. చప్పగా అనిపిస్తుంటాయి. నిజానికి పూర్తిగా పండిన పుచ్చకాయ ముదురు పచ్చ రంగులో ఉంటుంది. అలాంటి కాయలే రుచిగా ఉంటాయి.

మచ్చలు
కొన్ని పుచ్చకాయలపై ఒకవైపు తెలుపు, గోధుమ రంగు మచ్చలు చూసే ఉంటారు. ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత రుచిగా ఉంటుంది. కొన్ని కాయలపై పిచ్చి గీతలు గీసినట్లు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఈ కాయలు చాలా రుచిగా ఉంటాయి. ఈ మచ్చలు కూడా తేనెటీగలు పదే పదే వాలడం వల్ల ఏర్పడతాయంట.

తొడిమ
పుచ్చకాయ తొడిమను చూసి కూడా కాయ రుచి ఎలా ఉంటుందో చెప్పొచ్చు. తొడిమ ఎండిపోయినట్లు ఉంటే ఆ కాయ బాగా పండిందని అర్థం. అలా కాకుండా తొడిమ పచ్చిగా ఉంటే ఇంకా ఆ కాయ పండలేదనే చెప్పొచ్చు.

పుచ్చకాయను వేళ్లతో కొట్టడం ద్వారా
పుచ్చకాయను కొనేముందు దానిపై వేళ్లతో కొట్టడం ద్వారా ఆ కాయ ఎలాంటిదో కనుక్కోవచ్చు. పుచ్చకాయను వేళ్లతో తాకినప్పుడు గుల్లలా టక్ టక్ అని శబ్దం వస్తే ఆ కాయ బాగా పండిందని చెప్పొచ్చు. అదే శబ్దం రాకపోతే ఆ కాయ ఇంకా పండాల్సి ఉందని అర్థం

వాసనను బట్టి
పుచ్చకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసినప్పుడు తియ్యటి వాసన వస్తుంది. మరి తియ్యగా వస్తే మాత్రం ఆ కాయను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కాయ బాగా పండి.. మురిగిపోయేందుకు దగ్గరలో ఉందన్నమాట.
ఇవి కూడా చదవండి..
రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
పుచ్చకాయలను తింటే హైబీపీ సులభంగా తగ్గుతుందట..!
ఈ కాయ రాత్రి పూట తినొద్దు … ఎందుకంటే?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

