పంజాబ్ : ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో పొట్ట కూటి కోసం ఆటోనడుపుతున్నాడు ఒక జాతీయ బాక్సర్. ఎన్ఐఎస్ పాటియాలాలో శిక్షణ పొంది మంచి కోచ్‌గా ఎందర్నో బాక్సర్లుగా తీర్చిదిద్దాల్సిన ఈ బాక్సర్.. ఇప్పుడు మార్కెట్లో సామగ్రి లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ బతుకుదెరువు చూసుకుంటున్నాడు. ఈ హృదయ విదారక వీడియో నెటిజన్లలో చర్చకు దారితీసింది. భారతదేశంలో క్రీడాకారుల దుస్థితి గురించి చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్ స్పోర్ట్స్ షేర్ చేసింది. ఈ 17 నిమిషాల నిడివి గల క్లిప్‌లో ఈ మాజీ నార్త్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ అబిద్ ఖాన్ తన బాధను పంచుకున్నారు. 1988-89 లో ఎన్ఐఎస్ పాటియాలాలో శిక్షణ పొందాడు. అనంతరం ప్రొఫెషనల్ గా ఐదేండ్లపాటు ఆర్మీ బాక్సింగ్ జట్లకు శిక్షణ ఇచ్చాడు. పంజాబ్ విశ్వవిద్యాలయానికి కూడా ప్రాతినిధ్యం వహించాడు.
బాక్సింగ్‌లో ఎన్నో మెళకువలు తెలిసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సమయలో కుటుంబ పరిస్థితులు అతడ్ని ఆటో డ్రైవర్‌గా మార్చాయి. ఆర్ధిక సమస్యల కారణంగా బాక్సింగ్ శిక్షణను కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం బతుకుదెరువు కోసం ఆటో నడపడం, ధాన్యం బస్తాలను మార్కెట్లో దించుకోవడం చేస్తున్నాడు. క్రీడలలో తనకు మంచి నేపథ్యం ఉన్నప్పటికీ ఉన్నతమైన ఉద్యోగం కోసం ఎలా కష్టపడుతున్నాడో ఈ వీడియోలో అబిద్ ఖాన్ పంచుకున్నాడు.
జాతీయ బాక్సర్ అయినప్పటికీ.. తాను పడుతున్న ఇబ్బందులు తన ఇద్దరు కుమారులు పడకూడదని భావించి వారిని బాక్సింగ్ క్రీడవైపు రాకుండా వారిని నిరుత్సాహపరిచాడు. తిరిగి బాక్సింగ్ కోచింగ్‌లోకి రావాలని ఖాన్ ఆశిస్తున్నాడు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా అలా చేయలేకపోతున్నట్లు వాపోయాడు.
ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎంతో నైపుణ్యమున్న జాతీయ బాక్సర్‌ను ఇలా చూసి చాలా మంది నిరాశ చెందుతుండగా.. మరికొందరు ఆబిద్ ఖాన్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
Story of national boxer Abid Khan: From NIS qualified coach to driving auto…
— Saurabh Duggal (@duggal_saurabh) April 14, 2021
Watch full video at YouTube channel 'Sports Gaon'
And do watch it, we need to strengthen YouTube channel Sports Gaon to bring more such stories.. Thanks pic.twitter.com/hHjhTtW5W9
టీకా ఆఫర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోటల్స్
సముద్రంలో వందలాది పడవల మోహరింపు.. పరిస్థితిని సమీక్షిస్తున్న పీఎల్ఏ
కచ్ వద్ద పాకిస్తానీయుల పట్టివేత.. 150 కోట్ల హెరాయిన్ స్వాధీనం
66 ఏండ్ల క్రితం ప్రారంభమైన మెక్‌డోనాల్డ్.. చరిత్రలో ఈరోజు
భారత్‌లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
చంద్రుడిపై రోవర్‌ను పంపేందుకు జపాన్‌తో జతకట్టిన అరబ్ ఎమిరేట్స్
జూన్ 1 నుంచి హాల్‌మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..