కచ్ వద్ద పాకిస్తానీయుల పట్టివేత.. 150 కోట్ల హెరాయిన్ స్వాధీనం
గుజరాత్‌లోని కచ్ వద్ద భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మంది పాకిస్తానీయులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.150 కోట్ల విలువ చేసే 30 కేజీల హెరాయిన్‌ను స్వాధీనపర్చుకున్నారు.

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని కచ్ వద్ద భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మంది పాకిస్తానీయులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.150 కోట్ల విలువ చేసే 30 కేజీల హెరాయిన్‌ను స్వాధీనపర్చుకున్నారు.
పడవలో ప్రయాణిస్తూ భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరేబియా సముద్రం వెంబడి భారత సముద్ర సరిహద్దు లోపల వీరి పడవను పట్టుకున్నాయి. పదవలో 8 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ ట్విట్టర్లో గురువారం వెల్లడించింది.
గురువారం ఉదయం గుజరాత్ ఏటీఎస్‌తో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న జాఖౌ ఓడరేవు నుంచి పాకిస్తాన్ ఫెర్రీ పీఎఫ్బీ (పాకిస్తాన్ ఫిషింగ్ బోట్) ను ఐసీజీ పట్టుకున్నది. ఈ బోట్లో ఎనిమిది మంది పాకిస్తానీ పౌరులు ఉన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ను చూసి వారు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. పడవలో ఇండియాకు తరలించేందుకు తీసుకొచ్చిన 30 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఐసీజీ అందించిన సమాచారం ప్రకారం, స్వాధీనం చేసుకున్న హెరాయిన్ మార్కెట్ ధర రూ.150 కోట్ల వరకు ఉంటుంది. విచారణ సమయంలో అరెస్టు చేసిన చొరబాటుదారులు తమను మత్స్యకారులు అని చెప్పారు. ఈ మందుల పంపిణీ కచ్‌లోని జఖౌ పోర్టులో అందజేయాల్సి ఉందని తెలిపారు. హెరాయిన్ డెలివరీ ఎవరు తీసుకోబోతున్నారనే సమాచారం కూడా ఐసీజీకి లభించింది. ప్రస్తుతం ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
66 ఏండ్ల క్రితం ప్రారంభమైన మెక్‌డోనాల్డ్.. చరిత్రలో ఈరోజు
భారత్‌లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
చంద్రుడిపై రోవర్‌ను పంపేందుకు జపాన్‌తో జతకట్టిన అరబ్ ఎమిరేట్స్
ఎవర్ గివెన్‌ను స్వాధీనం చేసుకోండి : ఈజిప్ట్ కోర్టు
జూన్ 1 నుంచి హాల్‌మార్క్ నగలే అమ్మాలి..
సొంత ప్రజలపైనే కెమికల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బయటపెట్టిన నివేదిక
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

