Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Symbiosis Professor: నాగపూర్ సింబయాసిస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్.. మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు చేశాడు. దీంతో అతన్ని లీవ్‌పై పంపారు. ఇస్లామిక్ మత విధానాలను ఫాలో అవ్వాలని ఆ ప్రొఫెసర్ తన మెసేజ్‌ల్లో కోరినట్లు గుర్తించారు.
నాగపూర్: సింబయాసిస్ యూనివర్సిటీకి చెందిన నాగపూర్ క్యాంపస్‌లోని ఓ ప్రొఫెసర్(Symbiosis Professor)పై వేటు పడింది. ఆ క్యాంపస్‌లో చదువుకున్న మాజీ విద్యార్థినికి.. ప్రొఫెసర్ అనుచిత మెసేజ్‌లు చేసినట్లు తేలింది. ఇస్లామిక్ మత విధానాలను ఫాలో అవ్వాలని ఆ ప్రొఫెసర్ తన మెసేజ్‌ల్లో కోరినట్లు గుర్తించారు. దీంతో అతన్ని బలవంతపు లీవ్‌పై పంపినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ ప్రవర్తన గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే సదరు ప్రొఫెసర్ ఇప్పటికే తన పోస్టుకు రాజీనామా చేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే ఈ ఘటనలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఆరు నెలల క్రితమే ఆ స్టూడెంట్ వర్సిటీ వదిలి వెళ్లింది. నాగపూర్ సిటీ పోలీసులు రిక్వెస్ట్ చేసినా ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. ఆమె తండ్రి కూడా ఫిర్యాదుకు నిరాకరించాడు. ఆ అనుచిత మెసేజ్‌లకు చెందిన ఆధారాలను చూపెట్టలేకపోయారు. అసభ్యకరమైన మెసేజ్‌లే కాకుండా.. ఇస్లామిక్ మత ఆచారాలను ఫాలో అవ్వాలంటూ విద్యార్థిని సదరు ప్రొఫెసర్ ఎంకరేజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా ఏబీవీపీ, వీహెచ్‌పీ ఆందోళన చేపట్టాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

