e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News 66 ఏండ్ల క్రితం ప్రారంభ‌మైన మెక్‌డోనాల్డ్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

66 ఏండ్ల క్రితం ప్రారంభ‌మైన మెక్‌డోనాల్డ్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

66 ఏండ్ల క్రితం ప్రారంభ‌మైన మెక్‌డోనాల్డ్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆహారం ఉత్ప‌త్తిలో పేరుగాంచిన‌ మెక్‌డొనాల్డ్ 66 ఏండ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజుల‌న ప్రారంభ‌మైంది. ఇప్పుడు 100 కి పైగా దేశాలలో 36 వేలకు పైగా అవుట్‌లెట్‌లను క‌లిగి ఉన్న‌ది.

కాలిఫోర్నియాలో రిక్, మాక్ మక్డోనాల్డ్ అనే సోదరులు ఒక చిన్న రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ హోట‌ల్ మెనులో 4 వస్తువులు మాత్రమే ఉంటాయి. ఆహారం నాణ్యతగా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఆర్డర్ సమయం కూడా తక్కువగా ఉండ‌టం వ‌ల్ల‌ ప్రజలు అమితంగా ఇష్టపడ్డారు. దాంతో వారి వ్యాపారం నెమ్మదిగా ఊపందుకుంది. ఆర్డర్లు రావడం ప్రారంభమైనప్పుడు సకాలంలో డెలివరీ చేయ‌డం కోసం కొన్ని యంత్రాలను కొనుగోలు చేశారు. వీటిలో మిల్క్ షేక్ మేకింగ్ మిక్సర్లు కూడా ఉన్నాయి.

ప్ర‌స్తుతం ఈ సంస్థ 100 కి పైగా దేశాలలో 36 వేలకు పైగా అవుట్లెట్లను కలిగి ఉంది. ప్రతి రోజు 5 కోట్ల మంది ప్రజలు ఇక్కడి నుండి ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. ప్ర‌తి నిత్యం ఈ రెస్టారెంట్‌కు 5 కోట్ల‌ రూపాయలకు పైగా ఆర్డ‌ర్లు వ‌స్తుంటాయి. 2020 లో ఈ కంపెనీ ఆదాయం 19.21 బిలియన్ డాలర్లు (భారత క‌రెన్సీలో రూ.144 వేల కోట్లు).

భార‌త దేశంలో..

1996 లో మెక్‌డోనాల్డ్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఇక్కడ ఎక్కువ సవాళ్లు ఎదుర‌య్యాయి. తొలుత ఈ రెస్టారెంట్‌ శాఖాహారానికి ప్రాధాన్యతనిచ్చింది. ప్ర‌మోట‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌ల కార‌ణంగా వేల కోట్ల‌రూపాయ‌లు ఈ సంస్థ న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. ఈ సంస్థ ప్రస్తుతం భారతదేశంలో 500 కి పైగా రెస్టారెంట్లను కలిగి ఉంది.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2004: ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి మతపరమైన చిహ్నాలను ధరించడాన్ని నిషేధించే చట్టంపై సంత‌కం చేసిన‌ ఫ్రెంచ్ అధ్యక్షుడు జాక్ చిరాక్

1994: వాణిజ్య, సుంకం సాధారణ ఒప్పందం (జీఏటీటీ) పై సంతకం చేసి 124 వ దేశంగా త‌యారైన భార‌త్‌

1980: ఆరు ప్రభుత్వేతర బ్యాంకులను జాతీయం చేసిన భార‌త ప్ర‌భుత్వం

1976: త‌మ రాయబారిని 15 సంవత్సరాలలో మొదటిసారి బీజింగ్‌కు పంపినట్లు ప్రకటించిన భార‌త‌దేశం

1948: రాష్ట్రంగా ఏర్పాటైన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌

1940: ప్రసిద్ధ శాస్త్రీయ గాయకుడు సుల్తాన్ ఖాన్ జననం

1923: డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి అందుబాటులోకి వచ్చిన‌ ఇన్సులిన్

1689: స్పెయిన్‌పై యుద్ధం ప్రకటించిన ఫ్రాన్స్‌

1563: సిక్కుల ఐదవ గురువు గురు అర్జన్ దేవ్ జననం

1452 : ప్ర‌ముఖ చిత్ర‌కారుడు లియోనార్డో డా విన్సీ జ‌న‌నం

ఇవి కూడా చదవండి..

భార‌త్‌లో బోరిస్ జాన్స‌న్ ప‌ర్య‌ట‌న కుదింపు

చంద్రుడిపై రోవ‌ర్‌ను పంపేందుకు జ‌పాన్‌తో జ‌త‌క‌ట్టిన అర‌బ్ ఎమిరేట్స్

ఎవ‌ర్ గివెన్‌ను స్వాధీనం చేసుకోండి : ఈజిప్ట్ కోర్టు

జూన్ 1 నుంచి హాల్‌మార్క్ న‌గ‌లే అమ్మాలి..

సొంత ప్ర‌జ‌ల‌పైనే కెమిక‌ల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బ‌య‌ట‌పెట్టిన నివేదిక‌

ఆప్రికాట్ పండ్ల‌తో ఆరోగ్యం

టీకా వేసుకోండి.. ఎక్కువ వ‌డ్డీ పొందండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
66 ఏండ్ల క్రితం ప్రారంభ‌మైన మెక్‌డోనాల్డ్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement