డా నాంగ్ (వియత్నాం) : అండర్-23 ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో హోరెత్తిస్తున్నారు.సోమవారం జరిగిన ఫ్రీస్టయిల్ విభాగంలో అక్షయ్, విక్కీ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. 57 కేజీల విభాగం ఫైనల్లో అక్షయ్ 4-2 తేడాతో అమన్గెల్డి (కజకిస్థాన్)పై , 97 కేజీల విభాగంలో విక్కీ 7-5 తేడాతో ఉజ్బెకిస్థాన్‌కు రెజ్లర్ షెర్జోద్ పొయనోవ్పై గెలిచాడు.
మహిళల 53 కేజీల ఫైనల్లో ముస్కాన్ 6-2తో వియత్నాం రెజ్లర్ తి మై లిన్ న్గుయెన్‌ను ఓడించి పసిడి పతకాన్ని ముద్దాడింది. తపస్య(57 కేజీ) కజకిస్థాన్‌కు చెందిన షాగాయెవాను చిత్తు చేసింది. భాగ్యశ్రీ (62 కేజీ), పుల్కిత్ (65 కేజీ) కూడా పసిడి పతకాలు నెగ్గారు.