సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా వారిని నిరంతరం అప్రమత్తం చేస్తూ.. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. జిల్లా ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాల కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ఆయన.. డిజిటల్ పోలీసింగ్‌కు సంబంధించిన కీలక వ్యవస్థల పనితీరు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
- నేరాల నియంత్రణకు సమర్థంగా పనిచేయాలి
- ఐటీ కోర్ కార్యాలయ సందర్శనలలో భద్రాద్రి ఎస్పీ
కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 28: ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా వారిని నిరంతరం అప్రమత్తం చేస్తూ.. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. జిల్లా ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాల కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ఆయన.. డిజిటల్ పోలీసింగ్‌కు సంబంధించిన కీలక వ్యవస్థల పనితీరు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సీసీటీఎన్ఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్ పోర్టల్, నాట్‌గ్రిడ్ వ్యవస్థలను నిర్వహిస్తున్న సిబ్బందితో విడివిడిగా సమావేశమై ఆయా విభాగాల పనితీరు, పెండింగ్ అంశాలు, సాంకేతిక సమస్యలు, డేటా నమోదు, సేవల అమలుపై సమీక్ష జరిపారు. కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, కేసుల సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని సూచించారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల గుర్తింపు, బ్లాక్ చేయడం, రికవరీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణ స్పందన, బాధితుల డబ్బు రికవరీ, పెండింగ్ కేసులపై దర్యాప్తును వేగవంతంగా చేపట్టాలన్నారు. అవసరమైన కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్-111 అమలు చేయాలని, అధికారులు, సిబ్బంది సాంకేతిక శిక్షణ పొందుతూ సైబర్ నేరాల నియంత్రణలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకతతో కూడిన సేవలు అందించాలని ఆదేశించారు. డీఎస్పీ లింగనబోయిన ఆదినారాయణ, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ సముద్రాల జితేందర్, ఐటీ కోర్ ఎస్సై గణేశ్, పీఆర్వో బొల్లి సాయికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

