Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Netanyahu | భవిష్యత్ అమెరికా అధ్యక్షుడు (US President) ఇజ్రాయెల్ (Israel) కు శుత్రువు కావచ్చునని ఆ దేశ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో భారత్ (India), లాటిన్ అమెరికా (Latin America) వంటి బలమైన దేశాలతో పొత్తు పెట్టుకోవాలని నెతన్యాహు తన అధికారులకు పిలుపునిచ్చారు.
Netanyahu : భవిష్యత్ అమెరికా అధ్యక్షుడు (US President) ఇజ్రాయెల్ (Israel) కు శుత్రువు కావచ్చునని ఆ దేశ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో భారత్ (India), లాటిన్ అమెరికా (Latin America) వంటి బలమైన దేశాలతో పొత్తు పెట్టుకోవాలని నెతన్యాహు తన అధికారులకు పిలుపునిచ్చారు. స్థానిక మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మీడియా కథనాల ప్రకారం.. మరో రెండేళ్లలో ఇజ్రాయెల్ పట్ల శత్రుభావంతో ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చునని, వారు పురుషుడు లేదా మహిళ ఎవరైనా కావచ్చునని, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు..? అని అధికారులను ఉద్దేశించి నెతన్యాహు ప్రశ్నించారు. అగ్రరాజ్యంతో సంబంధాలు ఎలా నిర్వహిస్తారని అడిగారు. అమెరికా విధానంలో సంభవించే పెద్ద మార్పుకు సిద్ధమవుతూ.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లోనే ఇజ్రాయెల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.
వచ్చే రెండేళ్లలోనే అమెరికా సాయంతో చేయగలిగినదంతా చేయాలని నెతన్యాహు అన్నారు. అదే సమయంలో భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని దేశాలతో సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కూటములను ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పుడు తాను అదే పని చేస్తున్నానని అన్నారు. భారత్ చిన్న దేశమేమీ కాదని, అలాగే లాటిన్ అమెరికా, బ్రెజిల్‌లలో త్వరలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కూటముల సంఖ్యను విస్తరించుకోవాలని, విలువ పెంచే సామర్థ్యాలను వృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కాగా, దేశంలో ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన గాడి ఐసెన్‌కోట్ తప్పుబట్టారు. ఇతర దేశాల పేరు చెప్పి నెతన్యాహు ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్‌తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
AI | ఊపిరితిత్తుల సమస్యలను ఏఐ ముందుగానే గుర్తించగలదు.. వెల్లడించిన నిపుణులు..
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

