గంగాధర, మార్చి 6: గంగాధర మండలంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శనివారం చేపట్టే పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఆయనతోపాటు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. మధురానగర్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని, అనంతరం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారని తెలిపారు. గంగాధర మండలంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దామోదర్, ఎండీ నజీర్, శ్రీమల్ల మేఘరాజు, వడ్లూరి ఆదిమల్లు, దోమకొండ మల్లయ్య తదితరులు ఉన్నారు.