హమిర్పుర్: ఓ రిటైర్డ్ డాక్టర్(Retired Doctor) ఔదార్యాన్ని ప్రదర్శించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని డాక్టర్ రాధాకృష్ణన్ మెడికల్ కాలేజీకి సుమారు 80 కోట్ల విలువైన ప్రాపర్టీని రిటైర్డ్ సీనియర్ డాక్టర్ డాక్టర్ రాజేంద్ర కన్వర్ దానం చేశారు. ఆయన వయసు 77 ఏళ్లు. తనకు చెందిన మొత్తం స్థిర, చర ఆస్థులను ఆయన దానం చేశారు. 2021లో ఆయన దీనికి సంబంధించిన వీలునామా రాశారు. ఓ గిఫ్ట్ డీడ్‌తో ఆ ప్రక్రియను పూర్తి చేశారు. తనకు చెందిన భూమిని మెడికల్ కాలేజీ పేరు మీద మ్యుటేషన్ చేయించాడు. ఆయన సుమారు 33 ఏళ్ల పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో వైద్యుడిగా విదులు నిర్వర్తించారు. ప్రస్తుతం నాదాన్ ఏరియాలో ఉన్న జోల్ సప్పార్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పేదలకు, అవరమైన వారికి ఆయన చికిత్స కొనసాగిస్తున్నారు.
తన భార్య కృష్ణ కన్వర్‌తో కలిసి తన ఆస్తులను దానం చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఆ జంటకు పిల్లలు లేరు. తాము ఆర్జించిన జీతం.. సమాజ సంక్షేమం కోసం వాడాలని వారికి కోరిక ఉన్నది. విద్యాశాఖలో సుమారు 32 ఏళ్ల పాటు కృష్ణ కన్వర్ పనిచేశారు. 2011లో ఆమె స్కూల్ ప్రిన్సిపాల్ హోదాలో రిటైర్ అయ్యారు. విరాళం ఇచ్చిన ప్రాపర్టీల్లో రెండు అంతస్తుల బిల్డింగ్, కోట్ల ఖరీదైన నగలు, ఇతర స్థిరాస్తులు ఉన్నాయి. తమ ఇంటిని ఓల్డేజ్ హోమ్‌గా మార్చాలని కోరారు. కృష్ణ-రాజేంద్ర ఓల్డేజ్ హోమ్ అని పేరు పెట్టాలన్నది. తన అవయవాలను కూడా ఆయన దానం చేశారు. మన సంపాదన వేరొకరి జీవితాలను సంతోషపెడితే అది ఉత్తమమైనదని ఆయన అన్నారు.