Heavy Rains | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. 26 వరకు భారీ వర్షాలు!
Heavy Rains | బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
Heavy Rains | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం తీవ్ర వాయుగుండం పూరీకి సుమారు 310 కి.మీ, కళింగపట్నానికి 390 కి.మీ, విశాఖపట్నానికి 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు అధికారులు తెలిపారు. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశమున్నదని అంచనా వేశారు. వాయుగుండం ప్రభావంతో మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.
బుధవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని అధికారులు అంచనా వేశారు. కుమ్రం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపారు. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

