Dasyam Vinay Bhaskar | దాస్యంపై ఖాకీల ఓవరాక్షన్.. రెక్కలు విరిచి, మోకాలితో కడుపులో పిడిగుద్దులతో పోలీసుల పైశాచికం
Dasyam Vinay Bhaskar | వరంగల్‌లో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్పై పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఎంజీఎం దవాఖానను సందర్శించేందుకు వెళ్తున్న ఆయనపై విచక్షణ లేకుండా దాడి చేసి రక్తం కండ్లజూశారు.
Dasyam Vinay Bhaskar | వరంగల్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వరంగల్ చౌరస్తా : వరంగల్‌లో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్పై పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఎంజీఎం దవాఖానను సందర్శించేందుకు వెళ్తున్న ఆయనపై విచక్షణ లేకుండా దాడి చేసి రక్తం కండ్లజూశారు. భుజాలపై చేతులు వేసి, మోకాళ్లతో నెట్టడంతో ‘అమ్మా.. అమ్మా’ అని వినయ్‌భాస్కర్ తల్లడిల్లుతున్నా.. పోలీసులు మాత్రం నిలువరించే పేరుతో కడుపులో పిడిగుద్దులు కురిపిస్తూ క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో వినయ్‌భాస్కర్ కాలు, చేయికి గాయాలై రక్తస్రావమైంది. తీవ్ర ఉద్రిక్తతలతో భయోత్పాతాన్ని సృష్టించిన ఈ ఘటన మంగళవారం వరంగల్‌లోని ఎంజీఎం సాక్షిగా చోటుచేసుకున్నది.
అసలేం జరిగింది?
రెండు రోజుల క్రితం(ఆదివారం) ఎంజీఎం ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో రోగులు, వారి అటెండెంట్స్, సిబ్బంది గాయపడిన ఘటన మరువకముందే మంగళవారం ఆర్ఐసీయూ వార్డులో మరోసారి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. విషయం తెలుసుకున్న వినయ్‌భాస్కర్ హాస్పిటల్ పరిస్థితులను పరిశీలించేందుకు ఎంజీఎం బయల్దేరారు. అప్పటికే హాస్పిటల్ ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు మోహరించిన విషయాన్ని తెలుసుకున్న దాస్యం వినయభాస్కర్, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజు గణేశ్, జోరిక రమేశ్, పార్టీ నేతలు సదాంత్ తదితరులు హాస్పిటల్ వెనుక వైపున్న మార్చురీ నుంచి లోపలికి వెళ్లేందుకు ఉపక్రమించారు. అక్కడ వారిని అడ్డుకున్నారు. ముందుగా వినయ్‌భాస్కర్‌ను చుట్టుముట్టి, లోపలికి వెళ్లేందుకు వీళ్లేదని వారించారు. ‘మేం హాస్పిటల్లోకి వెళ్లకూడదా? రోగులను పరామర్శించకూడదా?

మమ్మల్ని లోపలికి వెళ్లనీయండి, ఎందుకు వెళ్లనీయడం లేదు’ అంటూ పోలీసులను ప్రశ్నిస్తూ వినయ్‌భాస్కర్ ముందుకు కదిలారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగి వినయ్‌భాస్కర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన కాలికి, చేయికి గాయాలయ్యాయి. ఒక దశలో తన చేయి విరిగిందంటూ కంటతడి పెట్టుకున్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడమే కాంగ్రెస్ ప్రజాపాలనా? అని నిప్పులు చెరిగారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులను మార్చురీ గేట్ నుంచి ఈడ్చుకెళ్లి గేటుకు తాళం వేశారు. అనంతరం దాస్యంను నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, తనకు ఎంజీఎంలోనే చికిత్స చేయించాలని ఆయన పట్టుబట్టారు. పోలీసుల తీరుపై రోగుల బంధువులు మండిపడ్డారు. దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ వ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కార్యకర్తలు మార్చురీ సెంటర్లో రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దాస్యంకు కేటీఆర్ ఫోన్
ఎంజీఎంహెచ్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. గాయపడిన వినయ్‌భాస్కర్‌కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలోని వరుస పరిణామాలను దాస్యం ఈ సందర్భంగా కేటీఆర్‌కు వివరించారు.
బోయినపల్లి, సిరికొండ పరామర్శ
దవాఖానలో చికిత్స పొందుతున్న వినయ్‌భాస్కర్‌ను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్‌కు పేరొస్తదని హాస్పిటల్ ప్రారంభించరా? : దాస్యం
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పూర్తిచేస్తే ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు దేశంలో ఎక్కడాలేని విధం గా కేసీఆర్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసినా రేవంత్ సర్కార్ ప్రారంభోత్సవం చేయకుండా కాలయాపన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎం జీఎం హాస్పిటల్ భవనాలకు కనీస మరమ్మ తు చేయించకుండా రోగుల ప్రాణాలను గాలి కి వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. హాస్పిటల్ కు తీసుకొచ్చిన వ్యక్తిని వార్డుకు తరలించడానికి సరైన స్ట్రెచర్లు, వీల్ చైర్లు లేవని, బెడ్స్ పరిస్థితి దయనీయంగా మారిందని, స్లైన్ స్టాం డ్లు ఏర్పాటు చేయలేని దయనీయ స్థితిలో ఎంజీఎం హాస్పిటల్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి పెచ్చులూడిపడి గాయాలపాలైతే ఇప్పటి వరకు ఒక్క ప్రజాప్రతినిధి, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు హాస్పిటల్ వైపు రాకపోవడం దారుణమంటూ నిప్పులు చెరిగారు. ఎంజీఎంలో రోగుల దుస్థితిని పరిశీలించేందుకు వెళ్తున్న తమను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుకున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన దుర్మార్గాలను నిరంతరం ఎండగడుతామని తేల్చిచెప్పారు.

ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి : కేటీఆర్
వరంగల్ ఎంజీఎం దవాఖాన వద్ద వినయ్భాసర్పై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపై కేసులు నమోదు చేసి, వారిని వెంటనే సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ప్రతిపక్ష నేతలకు ప్రజలను పరామర్శించే, వారి సమస్యలపై పోరాడే ప్రాథమిక హకు ఉన్నదని, ఆ హకును కాలరాయాలని చూడటం తగదని హెచ్చరించారు. ఎంజీఎంలో పైకప్పు కూలిన ఘటనలో గాయపడ్డ రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల మౌలిక సదుపాయాలు, భద్రతపై ప్రభుత్వం దృష్టిసారించాలని స్పష్టంచేశారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వెళ్లిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధిపై పోలీసులు ఇంత అమానుషంగా భౌతిక దాడికి దిగడం అత్యంత గర్హనీయమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో కనీస మౌలిక వసతులు, భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని, ఆ లోపాలను ప్రశ్నించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులపై పోలీసులతో దాడి చేయించడం ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే గొంతులను అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్యం సహించదని, వినయ్భాసర్పై జరిగిన ఈ దాడికి ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవుల్లో ఉన్న రేవంత్‌రెడ్డే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

