Kho Kho World Cup : భారత ఒలింపిక్ అసోషియేషన్ (IOA) నిర్వహిస్తున్న ఖో ఖో ప్రపంచకప్ (Kho Kho world cup) ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం ప్రారంభోత్సవ వేడుకలు ముగియగానే తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్-నేపాల్ (India-Nepal) దేశాలు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 పురుషుల టీమ్స్, 19 మహిళల టీమ్స్ పాల్గొంటున్నాయి.
ఈ ఖో ఖో ప్రపంచకప్ కప్ భారత్ ఇప్పటికే 15 మంది సభ్యుల చొప్పున ఉన్న పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది. పురుషులు, మహిళల విభాగంలో తలపడే జట్లను మొత్తం 4 గ్రూపులుగా విభజించారు. పురుషుల టీమ్ గ్రూప్-A లో నేపాల్, పెరూ, బ్రెజిల్ భూటాన్ దేశాలతో తలపడనుంది. అదేవిధంగా మహిళల టీమ్ కూడా గ్రూప్-A లో ఇరాన్, మలేషియా, దక్షిణ కొరియా దేశాలతో ఆడనుంది. అన్ని గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ ఖో ఖో ప్రపంచకప్ జరగనుంది. పురుషుల జట్టు ఇవాళ నేపాల్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. మహిళల జట్టు మంగళవారం దక్షిణ కొరియాతో తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 19 వరకు ఈ ఖో ఖో ప్రపంచకప్ జరగనుంది. 19న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
Z-Morh Tunnel | సోన్మార్గ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవీ టన్నెల్ ప్రత్యేకతలు
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?
Stock markets | కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం
Maha Kumbh | మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. పట్టాలపైకి 13వేల రైళ్లు..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!